ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమానికి సంపూర్ణ సహకారం
రామచంద్రపురం ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ విహారయాత్రకు 15 లక్షల రూపాయల అందచేత..ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం :
పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ రిటైర్డ్ పెన్షనర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
రామచంద్రపురం ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కాశీ, అయోధ్య, ఢిల్లీ విహారయాత్రను బుధవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విహారయాత్ర కోసం 15 లక్షల రూపాయల సొంత నిధులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ అంజయ్య, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, పరమేష్ యాదవ్, ఐలేష్, ప్రమోద్ గౌడ్, పెన్షనర్ల సంఘం ప్రతినిధులు రామిరెడ్డి, రాములు, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.
About The Author
16 Apr 2026
