విద్యుత్తు ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కేటీపీపి చెల్పూర్ లో గేట్ మీటింగ్

రాష్ట్ర చైర్మన్ సుంకు సతీష్ రెడ్డి

WhatsApp Image 2025-11-25 at 6.47.02 PM

భూపాలపల్లి : 
మంగళవారం గణపురం మండలం కేటీపీపి చెల్పూర్ లో గేట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగు రాష్ట్ర చైర్మన్ సుంకు సతీష్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను గత ప్రభుత్వం శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తామని చెప్పి విద్యుత్ సంస్థలో రెండు రకాల సర్వీస్ రూల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. 

కాంట్రాక్ట్ కార్మికులకు రెట్లు రెగ్యులరైజేషన్ చేయకుండా కొత్తగా స్టాండింగ్ ఆర్డర్స్ 1947 యాక్ట్ ప్రకారం APSEB రూల్స్  వర్తింప చేయకుండా  ఇండస్ట్రీ ఆక్ట్  ప్రకారంగా ఆర్టిజన్గా నామకరణం చేయడం జరిగింది. ఇట్టి చట్టాన్ని కార్మికులందరూ వ్యతిరేకిస్తూ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని రెగ్యులరూ ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్ కార్మికులందరినీ రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేయడం జరిగింది.ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీని కార్మికులందరికీ ఏపీ ఎస్సీబీ రూల్స్ సర్వీస్ తో కూడిన కన్వర్షన్ విద్యారతను బట్టి కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగింది ఇట్టి విషయాన్ని పలుమార్లు ప్రభుత్వానికి యాజమాన్యానికి ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది అయినా కూడా స్పందించడం లేదు కావున ఎలక్ట్రిసిటీ సంస్థలో ఉన్నటువంటి అన్ని సంఘాల ఆర్టిజన్ కార్మికులు అందరూ ఒక తాటిమీద కచ్చి తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది కావున తమరు ఇప్పటికైనా స్పందించి 23 వేల కార్మికులందరినీ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఏపీ ఎస్సీబీ రూల్స్ (కన్వర్షన్) ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది లేనియెడల డిసెంబర్ మొదటి వారంలో పెద్ద ఎత్తున కార్మికులందరితో ధర్నాలు రాస్తారోకాలు చేయాలని నిర్ణయించడం జరిగింది అప్పటికి స్పందించని యెడల ముకుమ్మడిగా కార్మికులందరూ సమ్మె వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని యాజమాన్యానికి మరియు ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. మా యొక్క డిమాండ్స్ విద్య మీ అందరితోనే నేను అర్హతను బట్టి ఆర్టిజన్ కార్మికులందరికీ ఏపీ ఎస్సీబీ రూల్స్ ద్వారా కన్వర్షన్ ఇవ్వాలి. మిగిలిపోయిన పీస్ రేట్ కార్మికుని జీవో నెంబర్ 11 ప్రకారం అందరినీ రెగ్యులరేషన్ చేయాలి. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ నాయకత్వం కన్వీనర్ సాయిల్, చంద్రారెడ్డి, కో చైర్మన్ శ్రీధర్ గౌడ్, కో కన్వీనర్ చందర్ సింగ్ ఠాగూర్, జెన్కో చైర్మన్ జక్కుల రమేష్, కన్వీనర్ సిలివేరు మల్లయ్య, కో కన్వీనర్ టి రమేష్, జాయింట్ సెక్రెటరీ సురేష్, ప్రణయ్, శంకర్, కృష్ణ, NPDCL కరీంనగర్ డివిజన్ నాయకులు ఏ రవీందర్, ఇతర కార్మిక సంఘాల ఆర్టిజన్ కార్మిక సోదరీ సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. 

About The Author