సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
- నిధులు కేటాయిస్తూ జీవో విడుదలపై హర్షం

 

WhatsApp Image 2025-10-29 at 7.16.17 PM

Read More అభివృద్ధి పనులకు 2కోట్ల హెచ్ఎండిఏ నిధులు మంజూరు

సంగారెడ్డి : 

Read More సామినేని హంతకుల అరెస్టు చేయాలి..

మున్సిపాలిటీల అభివృద్ధికి రేవంత్ సర్కార్ అన్ని విధాల సంపూర్ణ సహకారం అందిస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. 

Read More సిరల గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీఓ జదవ్ ప్రదీప్.

సంగారెడ్డిసదాశివపేట మున్సిపాలిటీల కు 18 కోట్ల 70 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి టీజీఐఐ సీ చైర్పర్సన్ నిర్మల తో కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.  రెండు మున్సిపాలిటీలకు కలిపి 37 కోట్ల 40 లక్షల రూపాయల నిధులతో త్వరలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు. వీటికి సంబంధించిన పనులను వివరించారు. అర్బన్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు జీవో విడుదల చేయడం జరిగిందన్నారు. సదాశివపేట మున్సిపాలిటీల పరిధిలో సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణం ఊబ చెరువు సుందరీ కరణ కోసం 1.5 కోట్లు, అయ్యప్ప దేవాలయం నుంచి బిఎస్ఎన్ఎల్ వరకు సెంట్రల్ మీడియం సెంట్రల్ లైటింగ్ కోసం 1.6 6 కోట్లు, డబుల్ బెడ్ రూమ్ పరిసరాల్లో కనీస సౌకర్యాల కోసం 50 లక్షలు, గురు నగర్ కాలనీలో పార్క్ డెవలప్మెంట్ కోసం 50 లక్షలు, హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు కోసం 30 లక్షలు, అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీలోనీ విలీన గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు, వరద నీరు మళ్లింపు కోసం ప్రత్యేక డ్రైనేజీల నిర్మాణం చేపట్టేందుకు 5.9 కోట్లు, పార్కుల అభివృద్ధి కోసం 1 కోటి 35 లక్షలు, పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలను ప్రణాళిక బద్ధంగా చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తామని వివరించారు.

Read More 18న నాయి బ్రాహ్మణుల వనమహోత్సవం

About The Author