వెంటాడుతున్న వైఫల్యాలు ( పార్ట్ - 4 )

- తెలంగాణ రాష్ట్రంలో హోమ్ శాఖ పనితీరుపై వెల్లువెత్తున్న విమర్శలు.. 
- ముఖ్యమంత్రి రేవంత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న హోం శాఖ.. 
- రాష్ట్రంలో శాంతి భద్రతలు సవ్యంగా సాగుతున్నాయా..? 
- హోమ్ శాఖను ఇతరులకు కేటాయించకపోవడాన్ని కారణం ఏమిటి..?
- దుర్వినియోగం అవుతుందన్న అనుమానమా..? సిస్టం చేజారిపోతుందని భయమా..? 
- ఈ శాఖతో బాటు మరిన్ని శాఖలను తనవద్ద ఉంచుకుని రేవంత్ పొరబాటు చేశాడా..?
- ఇన్ని శాఖలను సమన్వయం చేయడంలో విఫల అవుతున్న రేవంత్.. 
- ఎంతో కీలకమైన హోం శాఖ నిర్వీర్యం అవడం ప్రమాదం.. 
- ఇప్పటికైనా హోమ్ శాఖను సమర్ధవంతుడికి అప్పగించాలని సూచిస్తున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 

images

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ ) :

ప్రభుత్వ పనితీరుపై రాష్ట్ర హోం శాఖ తీవ్ర ప్రభావం చూపుతుంది.. రాష్ట్రంలో శాంతి భద్రతలు సజావుగా సాగాలంటే హోం శాఖ సమర్ధవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. అందుకనే  హోం శాఖ నిర్వహణ సమర్ధవంతమైన వారి వద్ద ఉండాలి.. కానీ అన్ని ప్రభుత్వాల్లో ప్రతి సారి కీలకమైన హోం శాఖను కొన్ని సందర్భాల్లో తప్ప అనుభవం లేని వారికే కేటాయించడం జరుగుతూఉంది.. ఎందుకిలా జరుగుతోంది.. మేధావులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఎవరైతే హోం శాఖను నిర్వహిస్తూ ఉంటారో.. వారి ఆధీనంలోనే శాంతి భద్రతలు, రక్షణ తదితరాలు ఉంటాయి.. ఈ శాఖ మంత్రి తలచుకుంటే అధికార ప్రభుత్వాన్ని తారుమారు చేయగలడు అన్నది నిర్విదాంశం.. అందుకే ఏ ముఖ్యమంత్రి అయినా హోం శాఖను తనకు అనుకూలంగా వుండే వారికే కేటాయిస్తారు.. తాము చెప్పినట్లు నడుచుకునే వారికే మాత్రమే ఇవ్వడం  మనం చూస్తున్నాం.. మరీ ముఖ్యంగా మహిళా నాయకురాళ్లకు హోం శాఖను ఇస్తూ ఉంటారు.. ఎందుకంటే వారు చెప్పినట్లు వింటారు.. ఎదురుతిరిగే సాహసం చేయలేరు.. ఒక రబ్బర్ స్టాంప్ లా ఉండిపోతారు..  కానీ హోం శాఖను తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకునే ముఖ్యమంత్రులు ఉన్నంతకాలం  శాంతి భద్రతలు కుంటుబడుతాయి.. కేవలం ప్రత్యర్థులను కట్టడి చేయడానికి, విపక్షాలను అదుపుచేయడానికి హోం శాఖను వినియోగించుకోవడం ఎంతో గర్హనీయం.. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అవుతుంది.. 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర హోం శాఖ ఎలా సాగుతోందో ఒకసారి తెలుసుకుందాం.. రేవంత్ తానే స్వయంగా హోమ్ శాఖను నిర్వహిస్తున్న విషయం విదితమే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీకి హోమ్ శాఖ ద్వారా  లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. హోమ్ మినిస్టర్ లేదా ఇతర వ్యక్తికి ఆ శాఖ అప్పగించలేదు.. ఇది ఆయనకు ప్రత్యక్ష నియంత్రణ ఇస్తుంది. దీనితో ఆయనపై, ఆ శాఖపై కొన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఎందుకంటే తెలంగాణలో శాంతి భద్రతా పరిస్థితులకు పెద్దపీఠ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. అసలే తెలంగాణ పోరాటాల గడ్డ.. విప్లవాలకు నెలవు.. అంతేకాకుండా హైదరాబాద్ నగరం ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా నెలవుగా వుంది.. ఇంకా మావోయిస్టుల కదలికలు కూడా కనిపిస్తూ ఉంటాయి.. అంతే కాకుండా నగరంలో అక్కడక్కడా  రౌడీషీటర్ల కార్యకలాపాలు కూడా కనిపిస్తుంటాయి.. ఇలాంటి పరిస్థితుల్లో హోమ్ శాఖ ఎంతో పఠిష్టంగా, బాధ్యతగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా రేవంత్ రెడ్డి “ప్రజా ప్రభుత్వం” పేరుతో తాము చేసిన వాగ్ధానాలను, హామీలను నిలబెట్టుకోవాల్సి వుంది.. అయితే, శాంతి భద్రతకు సంబంధించిన కొన్ని సంఘటనలపై విమర్శలు వచ్చాయి.. ప్రత్యేకంగా బీఆర్‌ఎస్ నాయకులు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. 

శాంతి భద్రత: ప్రస్తుత పరిస్థితి : 

ఆర్.ఎస్. ప్ర‌వీణ్ కుమార్ లాంటి నాయకులు రేవంత్ సర్కారును శాంతి భద్రతల పరంగా విఫలమైందని విమర్శిస్తున్నారు. అలాగే బీ.ఆర్.ఎస్. కేపీ వివేకానంద కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు. ఇక హరీష్ రావు వంటి మాజీ నేతలు కూడా “రెవంత్ రేడీ పాలన శాంతి భద్రతల్లో విఫలమైపోతోందని బలంగా విమర్శిస్తున్నారు.. 

అంతర్గత భద్రతా సవాళ్లు : 

బీ.ఆర్.ఎస్.  తీరుపై  ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మాఫియా గ్రూపుల ప్రభావం కూడా పెరిగింది.. అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.. బీ.ఆర్.ఎస్. ఆరోపిస్తున్నట్లు తమ నేతలపై పోలీసులు అనుచిత రీతిలో ప్రవర్తిస్తున్నారని, తమ వ్యక్తిగత వివరాలను సేకరించి పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు.. “గన్ కల్చర్” అనే పదం కూడా కొంతమంది చేస్తున్న విమర్శల్లో వినిపిస్తూ ఉండటం ఆందోళన కలిగించే విషయం.. అంటే సాంఘిక రాజకీయాల్లో హింస / అనియంత్రిత ఆయుధాల ప్రాశస్త్యం ఉందని తెలుస్తోంది.. 

పోలీసింగ్ నిర్వహణ :

శాంతి భద్రత నిర్వహణలో కొంత అపారదర్శకత ఉంది అని అనేక విమర్శలు ఉన్నాయి..  పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను ప్రభుత్వం స్వప్రయోజనాలకు వినియోగిస్తున్నారనే  ఘాటైన ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి..  కొన్ని సందర్భాల్లో, హింసా లేదా హింసాశ్రిత ఘటనలు జరిగినప్పుడు పోలీసులు సరిగా స్పందించలేదని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.. 

పార్లమెంటరీ, ప్రభుత్వ నిర్వహణ : 

హోమ్ శాఖను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించడం వల్ల అతని రాజకీయ ప్రాధాన్యతల పరిస్థితులకు ఎక్కువ లాభమవచ్చు, అదేవిధంగా విపక్షాలను అణచివేసే కార్యక్రమాలు ఎక్కువుగా జరగవచ్చు అన్నది విశ్లేషకుల వాదన.. అదే విధంగా ప్రభుత్వం “గన్ కల్చర్”, అలాగే భయభ్రఅంథులు కలిగించడం ద్వారా వ్యతిరేక వర్గాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే విమర్శలు కూడా వున్నాయి.. ఇది శాంతి పరంగా ఒక తీవ్రమైన సవాలు అని చెప్పుకోవచ్చు.. 

అవినీతి / క్యారప్షన్ సంబంధిత అంశాలు : 

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, హోమ్ శాఖ లేదా ప్రభుత్వంలో కొన్ని అవినీతి కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి.. అందులో కొన్ని ముఖ్యమైనవి చూద్దాం.. :ప్రతిపక్ష నాయకులపై బెదిరింపుల వాతావరణం ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే భయపెడుతూ తమకు అనుగుణంగా ప్రయోజనాలను పొందుతున్నారు అని విపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి.. 

రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసింగ్ వినియోగం :

పోలీసులకు ఓపిక లేకపోవడమో, లేదా ఉద్దేశపూర్వకంగా పోలీస్ లు కఠిన చర్యలను చేపడుతున్నట్టు కూడా ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి.. దీనితో ప్రభుత్వం ప్రత్యక్షంగానో పరోక్షంగానో విపక్షాలపై దాడులు చేసే అవకాశం ఉందని మేధావులు అంటున్నారు.. 

ప్రభుత్వ లోపాలు  : 

రాష్ట్రంలో “అధికారం పరంగా మాఫియా కారణంగా ప్రభుత్వం కొంత అస్థిరతకు లోనయింది.  కాగా బీ.ఆర్.ఎస్. నాయకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని “మాఫియా క్యాబినెట్” అని కూడా విమర్శించగా, వారు త్వరగా కేసులు నమోదు చేయడం లేదని, ప్రత్యేకంగా రాజకీయ-సంబంధిత వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదనే ప్రశ్నలు వేస్తున్నారు. 

ఈ పరిస్థితులను ఏవిధంగా చూడవచ్చు ? 

ముఖ్యమంత్రి స్వయంగా హోమ్ శాఖను నియంత్రించడం అంటే శాంతి భద్రత, పోలీస్ పాలసీపై అతను ఎక్కువ నియంత్రణ కలిగి ఉంటాడు. ఇది కొన్ని వ్యక్తులకు ప్రామాణికత ఇస్తే, ఇతరులకు భయాన్ని కలిగించవచ్చు.. ముఖ్యంగా విమర్శలకు అవకాశం ఉంది.. పోలీసింగ్ నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించబడతున్నాయి అనే. విపక్షపు వాదనలు వినిపిస్తున్నాయి.. ఇతర పార్టీలకు చెందిన  నేతలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.. దీనితో రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణిస్తున్నదనే వాదనను కాదనలేమని మేధావులు సైతం అంటున్నారు.. హోం శాఖా మీద అవినీతి ఆరోపణలు ఉన్నందున, పారదర్శకమైన విచారణల అవసరం ఉంది.. 

ప్రభుత్వానికి ప్రజలకు భద్రత కల్పించడానికి, పోలీస్ సిబ్బంది శిక్షణ, ఇంటెలిజెన్స్ సామర్థ్యం, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి విధానాలను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశేషకులతో బాటు " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ సూచిస్తోంది.. 

About The Author