డాక్టరేట్ అందుకున్న కిన్నెర మొగులయ్యకు సన్మానం
అరుదైన కళాకారుడికి అభినందనలు : సీఐలు వినోద్ కుమార్, మహేశ్..
ఎల్బీనగర్:
‘తెలంగాణ సంస్కృతిలో అరుదైన కళగా పేరొందిన 12 మెట్ల కిన్నెర గానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగులయ్య’ అని వనస్థలిపురం పోలీస్ ఇన్స్పెక్టర్ టి. మహేశ్, ఎల్బీనగర్ సీఐ వినోద్ కుమార్ అన్నారు. అంతరించి పోతున్న కళను తన ప్రదర్శనల ద్వారా వెలుగులోకి తెచ్చిన మొగులయ్యకు ఇటీవల చెన్నైలోని ‘గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ’ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎల్బీనగర్, వనస్థలిపురం పోలీస్ స్టేషన్లకు వచ్చి ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, మహేశ్ లను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా ఇరువురు సీఐలు మొగులయ్యను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. కళారంగంలో వారి కృషి రాష్ట్రానికి , దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చిందని సీఐలు వినోద్ కుమార్ టి. మహేశ్ లు ప్రశంసించారు..jpeg)
About The Author
21 Feb 2026
