అగ్ని ప్రమాదాలకు హైడ్రా.. చెక్..!
ఫైర్ సేఫ్టీ అంటే 'పైసా' ఖర్చు కాదు.. ప్రాణాలకు రక్షణ!
- నిబంధనలు తుంగలో తొక్కితే షాపులు సీజ్.. విద్యుత్ కట్!
- హైడ్రా యాక్షన్ ప్లాన్.. రంగంలోకి దిగుతున్న తనిఖీ బృందాలు
- ఫిర్యాదులకు 9000113667 నంబర్ కేటాయింపు
హైదరాబాద్:
విశ్వనగరం ఇప్పుడు 'విస్ఫోటన' నగరంలా మారుతోంది. నెలకో మూడు భారీ అగ్నిప్రమాదాలు.. ఏడాదికి 36 ఘటనలు.. లెక్కలేనంత ఆస్తి నష్టం.. మరెన్నో పచ్చి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అయినా వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. కేవలం లాభమే పరమావధిగా నిబంధనలను బుట్టదాఖలు చేస్తున్న 'వ్యాపార వెర్రి'పై హైడ్రా (HYDRAA) కన్నెర్ర చేసింది. ఫైర్ సేఫ్టీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఇక తనిఖీల పర్వం కాదు.. నేరుగా 'సీజ్' పర్వమేనని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.
సెల్లార్ అంటే స్టాక్ రూమ్ కాదు!
విద్యుత్ సరఫరా బంద్.. నోటీసులు మస్ట్!
మొదటి దెబ్బ: నిబంధనలు లేని భవనాలకు వెంటనే పవర్ సప్లై కట్ చేస్తారు.
రెండో చర్య: షాపును సీజ్ చేసి, గేట్లకు భారీ నోటీసు బోర్డులు తగిలిస్తారు.
అవగాహన: "ఇది ప్రమాదకరమైన భవనం.. ఇక్కడ ఫైర్ సేఫ్టీ లేదు" అని రాసి ప్రజలను అప్రమత్తం చేస్తారు.
హైడ్రా అస్త్రాలు ఇవే:
మెట్ల దారి నిఘా: సెల్లార్ నుండి టెర్రాస్ వరకు ఎగ్జిట్ పాయింట్లు లాక్ చేస్తే కఠిన చర్యలు.
వసతిపై ఉక్కుపాదం: కమర్షియల్ కాంప్లెక్సుల్లో నివాస గదులు ఉంటే సహించేది లేదు.
ఆటోమేషన్: మనుషుల ప్రమేయం లేకుండా మంటలను ఆర్పే 'స్ప్రింక్లర్లు' పనిచేయాల్సిందే.
స్టాఫ్ ట్రైనింగ్: షాపులో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఫైర్ ఎక్స్‌టింగ్యుషర్ వాడటం తెలిసి ఉండాలి.
మీ చుట్టుపక్కల ముప్పు ఉందా?
మీరు నివసించే అపార్ట్‌మెంట్లు లేదా పని చేసే ఆఫీసుల్లో అగ్నిప్రమాదానికి ఆస్కారం ఉన్న పరిస్థితులు కనిపిస్తే మౌనంగా ఉండకండి. వెంటనే 9000113667 నంబర్‌కు కరెంట్ లొకేషన్‌తో పాటు వీడియోలు, ఫోటోలు పంపండి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచి, హైడ్రా బృందాలు తక్షణమే రంగంలోకి దిగుతాయి. మన నగరాన్ని అగ్ని ప్రమాదాల రహిత నగరంగా మార్చుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హైడ్రా కమిషనర్ పిలుపునిచ్చారు.
