ఐడిఎస్ఎంటి పనులు వేగవంతం చేయాలి..
సుడా చైర్మన్ కోమటిరెడ్డి..
కరీంనగర్ :
ఐడిఎస్ఎంటి పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆదేశించారు. వివిధ పనుల నిమిత్తం టవర్ సర్కిల్ పరిసర ప్రాంతాలకు వచ్చేవారికి పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పనులు వేగవంతం చేయాలని కోరారు. కాంప్లెక్స్ షట్టర్స్ అందుబాటులోకి తీసుకురావాలని, నెల రోజుల్లో పనులు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఈ రాజేంద్ర ప్రసాద్, ఎఈ సతీష్, కాంట్రాక్టర్ శ్రీనివాస్, అజ్మల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గడియారం ప్రాంతంలో దుర్గా దేవి నవరాత్రులను పురస్కరించుకొని ప్రతిష్టించిన అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
About The Author
06 Dec 2025
