మత్తులో స్టీరింగ్ పడితే జైలుకే!

  • ​మల్కాజిగిరిలో వారాంతపు తనిఖీల్లో 321 మందిపై కేసులు
  • ​భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 కింద కఠిన చర్యలు

మత్తులో స్టీరింగ్ పడితే జైలుకే!

మల్కాజిగిరి

 వారాంతపు మత్తులో జోగుతూ వాహనాలు నడిపేవారిపై మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఏకంగా 321 మంది మద్యం బాబులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులే ఉండటం గమనార్హం.

​వాహనాల వారీగా వివరాలు:

పోలీసుల తనిఖీల్లో 249 ద్విచక్ర వాహనాలు, 11 త్రీ వీలర్లు, 59 ఫోర్ వీలర్లు మరియు రెండు భారీ వాహనాల డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికిపోయారు. వీరిలో 11 మందికి రక్తంలో ఆల్కహాల్ శాతం (BAC) 301 mg కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వీరందరినీ త్వరలోనే కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.WhatsApp Image 2026-03-09 at 19.23.51

​గత వారం తీర్పులు:

మార్చి 1 నుండి 7వ తేదీ వరకు నమోదైన పాత కేసులకు సంబంధించి కోర్టులో 228 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో ఐదుగురికి జరిమానాతో పాటు జైలు శిక్ష పడగా, మరో పది మందికి జరిమానా మరియు సామాజిక సేవ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మిగిలిన 213 మందికి జరిమానా విధించారు.

​హెచ్చరిక: 10 ఏళ్ల జైలు శిక్ష పడవచ్చు!

"మద్యం సేవించి వాహనం నడిపి ప్రాణాంతక ప్రమాదాలకు కారణమైతే, ఇకపై సాధారణ కేసులు కాకుండా భారతీయ న్యాయ సంహిత (BNS)-2023, సెక్షన్ 105 కింద 'హత్య కాని నేరపూరిత నరహత్య' కేసులు నమోదు చేస్తాం. దీనివల్ల నిందితులకు పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది" అని మల్కాజిగిరి డి.సి.పి స్పష్టం చేశారు.

About The Author