కోర్టును తప్పుదోవ పట్టించి.. ‘సౌర’ ముసుగులో అక్రమ నిర్మాణం!

  • *ఎల్బీనగర్ చింతలకుంట ‘హై ఫై ప్లాజా’లో బరితెగింపు!
  • *సోలార్ ప్యానెళ్ల పేరిట అదనపు అంతస్తుల నిర్మాణం?
  • *మున్సిపల్ నోటీసులు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు బేఖాతరు!
  • *‘భారత శక్తి’ సంచలన నిజాల వెల్లడి!

కోర్టును తప్పుదోవ పట్టించి.. ‘సౌర’ ముసుగులో అక్రమ నిర్మాణం!


హైదరాబాద్:

చట్టాన్ని గౌరవించాల్సిన వారే.. చట్టంలోని లొసుగులను వాడుకుంటూ, దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టిస్తూ అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న ఉదంతం ఎల్.బి. నగర్ పరిధిలో వెలుగుచూసింది. పర్యావరణ పరిరక్షణ, ‘సౌర విద్యుత్’ ఉత్పత్తి అనే పవిత్రమైన ముసుగు వేసుకుని, మున్సిపల్ చట్టాలను, ఫైర్ సేఫ్టీ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ‘హై ఫై ప్లాజా’ (విశాల్ మార్ట్ భవనం) యాజమాన్యం సాగిస్తున్న అక్రమ దందాపై ‘భారత శక్తి దినపత్రిక’ అందిస్తున్న ప్రత్యేక పరిశోధనాత్మక కథనం.

*కథనం నేపథ్యం: అక్రమ నిర్మాణానికి ‘సోలార్’ రక్షణ కవచం!

రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్ మండలం, సాహెబ్ నగర్ ఖుర్ద్ పరిధిలోని ఎల్బీనగర్ చింతలకుంట, పల్లవి గార్డెన్ ప్రక్కన, సర్వే నంబర్ 1 మరియు 1/ఎ1 లో  "హై ఫై ప్లాజా"  - విశాల్ మార్ట్ బిల్లింగ్' కొలువై ఉంది. ఈ భవనానికి సంబంధించి గతంలో బిల్డింగ్ పర్మిషన్ నంబర్: 1/సి3/09037/2018 (తేదీ: 11 జూలై, 2018)" ద్వారా అనుమతులు పొందారు. అనంతరం "ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC) నంబర్: 1/సి3/07689/2021-ఓసి (ప్రొసీడింగ్స్ నం: ఓసి 1/సి3/09231/2021, తేదీ: 19 ఆగస్టు, 2021)" కూడా పొంది వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు.
అయితే, అనుమతి పొందిన పరిమితికి మించి, భవనంపై అక్రమంగా అదనపు అంతస్తును నిర్మిస్తున్నారనే స్థానిక ప్రజల ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన మల్కాజ్‌గిరి మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు (నాగోల్ సర్కిల్ నెం. 11, ఎల్.బి. నగర్ జోన్) గత మే నెలలో రంగంలోకి దిగారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం, డిప్యూటీ కమిషనర్ ద్వారా 04-05-2026 నాటి షోకాజ్ నోటీసు (No. UC-41/TPS/C11/MMC/2026) ను భవన యాజమాన్యానికి జారీ చేశారు.WhatsApp Image 2026-06-07 at 20.15.41

*కోర్టులో తప్పుడు ఆధారాలు – లభించిన తాత్కాలిక ఊరట!
మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తారనే భయంతో, పిటిషనర్ డాక్టర్ పెండ్యాల సుజ్ఞానేశ్వర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు "(W.P. No. 16820 of 2026)". కోర్టులో తాను ఎలాంటి వాణిజ్య లేదా నివాస అవసరాల కోసం అదనపు అంతస్తు నిర్మించడం లేదని, కేవలం కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారం '160 kWp సోలార్ గ్రిడ్-కనెక్టెడ్ రూఫ్‌టాప్ పవర్ ప్లాంట్‌ను' మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు నమ్మబలికారు.
కోర్టుకు వాస్తవాలను దాచి, తప్పుడు ఫోటోలు, తప్పుడు ఆధారాలు సమర్పించి.. గౌరవనీయులైన శ్రీమతి జస్టిస్ టి. మాధవి దేవి గారి నేతృత్వంలోని బెంచ్ నుండి గురువారం, మే 21, 2026 న తాత్కాలిక ఆదేశాలు (Interim Direction) పొందారు.

 *కోర్టు విధించిన కఠిన షరతులు ఇవే:
*సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ప్రక్రియలో అధికారులు జోక్యం చేసుకోకూడదు.

*ఈ నిర్మాణాన్ని కేవలం సౌర విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నివాస, వాణిజ్య అవసరాలకు వాడరాదు.

*కేసు వీగిపోతే స్వంత ఖర్చులతో నిర్మాణాన్ని తొలగిస్తామని పిటిషనర్ హామీ (Undertaking) ఇవ్వాలి.WhatsApp Image 2026-06-07 at 20.12.50 (1)

*‘భారత శక్తి’ నిలదీస్తోంది: ఇదా సోలార్ ప్లాంట్ అంటే?
కోర్టు ఇచ్చిన తాత్కాలిక ఆదేశాల (ఇంటెరిమ్ ఆర్డర్స్) ఆసరాగా చేసుకుని, ప్రస్తుతం సదరు భవనంపై యథేచ్ఛగా అక్రమ శాశ్వత నిర్మాణ పనులు సాగుతున్నట్లు ‘భారత శక్తి’ పరిశోధనలో తేలింది. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ముసుగులో పిల్లర్లు, గోడలు లేస్తూ.. మున్సిపల్ రూల్స్‌ను, ఫైర్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.

 1.ఫైర్ సేఫ్టీకి పాతర: భారీ మాల్స్ ఉండే ఇలాంటి కమర్షియల్ కాంప్లెక్స్‌లపై నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మిస్తే, రేపు ఏదైనా ప్రమాదం జరిగితే వందలాది మంది ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. దీనికి బాధ్యులెవరు?

 2. కోర్టు ధిక్కరణ కాదా?: కోర్టు కేవలం సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకే అనుమతి ఇచ్చింది. కానీ అక్కడ జరుగుతున్న భారీ కాంక్రీట్ నిర్మాణాలు కోర్టును తప్పుదోవ పట్టించడమే కాకుండా, కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అవుతుంది.WhatsApp Image 2026-06-07 at 20.17.07

*ముగింపు: జూన్ 18న ఏం జరగబోతోంది?
స్థానిక ప్రజల రక్షణను, మున్సిపల్ చట్టాలను కాలరాస్తూ సాగుతున్న ఈ అక్రమ గుట్టును ‘భారత శక్తి దినపత్రిక’ గతంలోనే బట్టబయలు చేసింది. ఇప్పుడు కూడా శాస్త్రీయ ఆధారాలతో, ఫైల్ నంబర్లతో సహా ఈ అక్రమాలను ప్రజల ముందు, అధికారుల ముందు ఉంచుతోంది.
ఈ కేసు తదుపరి విచారణ "జూన్ 18, 2026 న జరగనుంది. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎం.ఎం.సి) లీగల్ సెల్ స్పందించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ రూపంలో ఉన్న అక్రమ నిర్మాణాల ఫోటోలను, నిజాలను కోర్టు ముందు ఉంచి, అక్రమార్కుల ఆట కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.WhatsApp Image 2026-06-07 at 20.17.08 - Copy

About The Author