జలమండలిలో జలగలు... రూల్స్ కు వ్యతిరేకంగా పైరవీలు

  • స్థాన చలనమే తప్ప...లంచాలు మాత్రం ఎక్కడైనా అంతే..
  • లంచాలు ఇస్తే ఒక తీరు.. ఇవ్వకుంటే ఇంకొక తీరు..
  • ఈ స్థాయిలోనే ఇంత దోచుకుంటే భవిష్యత్ లో ఇంకెంత దోపిడీ..?
  • అధికారులకు మడుగులొత్తే రిటైర్డ్ ఉద్యోగులు...
  • డీజీఎం కార్యాలయం బయటే తిష్ట...చేపల కోసం వేట...
  • నిబంధనలకు విరుద్ధంగా 2026-2-2764 అప్లికేషన్ లో కూడా వీరి మొబైల్ నంబరే...
  • పని చేసేది జలమండలిలో బైక్ మీద స్టిక్కర్ జీహెచ్ఎంసీది

జలమండలిలో జలగలు... రూల్స్ కు వ్యతిరేకంగా పైరవీలు

ఎల్బీనగర్:

ఎల్బీనగర్ నియోజకవర్గంలో జలమండలి శాఖలో కొత్త ఇంటికి నల్లా కనెక్షన్ అప్లై చేసుకుంటే అప్లికేషన్ ఫైలు ఒకరిది, మొబైల్ ఫోన్ నెంబర్ మాత్రం సర్కిల్ 6 మన్సురాబాద్ సివరేజ్ సూపర్వైజర్ ఉప్పరి హుస్సేన్ ది. నిబంధనలకు విరుద్ధంగా నల్లా కనెక్షన్, డ్రైనేజీ కనెక్షన్లు అప్లై చేసి తన మొబైల్ నెంబర్ పెట్టుకుని తదుపరి జరిగే ఎలాంటి అప్ డేట్ కూడా దరఖాస్తుదారుడికి తెలియకుండా మోసాలు చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.సక్రు నాయక్ పని చేసేది జలమండలి శాఖలో, కానీ ఆయన నడిపే ద్విచక్ర వాహనంపై జిహెచ్ఎంసి ఉద్యోగులు వేసుకునే స్టిక్కర్ తగిలించుకొని స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తుంటాడు.గతంలో డివిజన్ 11 లో ఎల్బీనగర్ సెక్షన్ లో పని చేస్తూ కస్టమర్ల దగ్గర అధిక డబ్బులు డిమాండ్ చేస్తూ వాళ్ళని దుర్భాషలాడుతూ, అనేక ఆరోపణలు ఎదుర్కొని డివిజన్ 5 లో కొత్తగా ఏర్పడ్డ సర్కిల్ లింగోజిగూడ సెక్షన్ కి బదిలీ అయిన కేతావత్ సక్రూ నాయక్ సివరేజ్ సూపర్వైజర్ తో కలిసి ఇలా మురుగు నీళ్ల కనెక్షన్లు, మంచినీటి నల్లా కనెక్షన్లను ఇద్దరు మరో జోడెద్దుల మాదిరిలాగా జలమండలిని తిమింగలాలుగా పీక్కుతింటూ కొత్తగా అప్లై చేసే నల్ల మరియు మురుగు నీళ్ళ కనెక్షన్లకు సైతం వాళ్ళ సొంత నెంబర్లను పెట్టి ఎవరికి అప్లికేషన్ అప్ డేట్ తెలియకుండా అధిక డబ్బులు డిమాండ్ చేస్తూ కస్టమర్లని తారుమారు చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ నెంబర్ ని పెట్టుకొని ఇలాంటి లావాదేవీలు అనధికారిక పనులు చేస్తున్న ఇద్దరి సివరేజ్ సూపర్వైజర్లపైన నిఘా పెట్టి వాళ్ళు చేస్తున్న ఈ అక్రమ దందాలని అరికట్టాలని, వారి బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించాలని డివిజన్ల ప్రజలు, సామాజిక వేత్తలు కోరుకుంటున్నారు. కేతావత్ సక్రు నాయక్ డివిజన్ 5 లింగోజిగూడ సెక్షన్ కి మార్చినా కూడా ఇతని ఆగడాలు ఇంకా కొత్తగా ఏర్పడ్డ సర్కిల్ 6 లో పాత వాసన పోకుండా ఉండాలని ఆ లంచగొండి అవతారాన్ని కాపాడుకోవాలని పదేపదే సర్కిల్ 6 హయత్ నగర్ జనరల్ మేనేజర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ, అక్కడ కార్యాలయంలో కొత్తగా కనెక్షన్ కోసం దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చే వారిని భయాందోళనకు గురిచేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్లనే కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు..ఆ ఫైల్ నేను చేస్తా అని వాళ్ళని అధిక మొత్తంలో డిమాండ్ చేస్తూ డబ్బులు అడగడం జరుగుతుంది. అందుకు నిదర్శనమే ఈ ఫోటోలు సర్కిల్ 6 హయత్ నగర్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో తిష్ట వేస్తూ జనరల్ మేనేజర్ మా బావ అంటూ అక్కడికి వచ్చిన వారిని పరిచయం చేసుకుంటూ ఇలాంటి పనులు పునరావృతం చేస్తున్నాడు కేతావత్ సక్రు నాయక్. కొత్తగా ఏర్పడ్డ సర్కిల్ 5 లో లింగోజిగూడ సెక్షన్ సేవరేజ్ సూపర్వైజర్.జలమండలిలో పనిచేసి రిటైర్డ్ అయిన కొంతమంది పెన్షన్లు తీసుకుంటూ కూడా డీజీఎం, జీఎం ఆఫీసులలో తిష్ట వేసి వచ్చే వారిని, పాత పరిచయం ఉన్నవారిని బుట్టలో వేసుకొని, పైరవీలు చేస్తూ,కనెక్షన్ కు గింత అని లంచం తీసుకుంటూ,అందులో అధికారులకు వాటాలు పంచుతూ, దరఖాస్తుదారులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కొని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుదారులకు న్యాయం చేయాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.WhatsApp Image 2026-03-27 at 18.51.29 (1)

About The Author