ఇందిరమ్మ ఇళ్లు.. కల సాకారం!
ప్రశాంతి హిల్స్‌లో గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులు
మీర్పేట్:
పదేళ్ల నిరీక్షణ తర్వాత పేదల సొంతింటి కల నెరవేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకంలో భాగంగా 58వ డివిజన్ ప్రశాంతి హిల్స్, 34వ వార్డుకు చెందిన ప్యాట కవిత - బాలరాజ్ దంపతులకు ఇల్లు మంజూరైంది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఇంటికి బుధవారం వారు గృహ ప్రవేశం చేశారు.
పూజా కార్యక్రమాల్లో నేతల భాగస్వామ్యం
లబ్ధిదారుల ఆహ్వానం మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హాజరైన వారు
కో-ఆప్షన్ సభ్యులు జెటవత్ రవినాయక్, వార్డు ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్లు టిట్ల కృష్ణ, ధరవత్ స్వామి నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షులు స్వాగత్ శ్రీనివాస్, నక్క బాలకృష్ణ, తిరుపతయ్య, ఆలేటి నాని, లక్ష్మణాచారి, మైత్రి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
