బల్వంతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

బల్వంతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

దుబ్బాక:
 
పేదల ఇళ్ల కల సాకారం కాంగ్రెస్ తోనే సాధ్యమని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సోమవారం దుబ్బాక మండలం బల్వంతపూర్ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరై గృహ యజమానులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పేదల ఇళ్ల కల సాకారం అవుతోందని పేర్కొన్నారు. ఇలాంటి పథకాలు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి, డైరెక్టర్ నరేందర్ రెడ్డి, మట్ట కిషన్ రెడ్డి, రేకులకుంట డైరెక్టర్ చిట్యాల ధనుంజయ, చీకోడ్ సర్పంచ్ నరేష్, సాయి తేజ గౌడ్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About The Author