గోషామహల్, కార్వాన్ సర్కిళ్లలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్ తనిఖీ,
హైదరాబాద్:
‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సోమవారం ఉదయం గోషామహల్, కార్వాన్ సర్కిళ్లలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. పారిశుద్ధ్యం, జంక్షన్ల అభివృద్ధి, రహదారుల నిర్వహణ పనులను స్వయంగా పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పర్యటనలోని ముఖ్యాంశాలు:
జంక్షన్ల అభివృద్ధి: భగత్ సింగ్ జంక్షన్ వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు. రహదారులపై ఉన్న గుంతలకు తక్షణమే ప్యాచ్ వర్క్‌లు పూర్తి చేసి, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఆక్రమణల తొలగింపు: అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఉగాది నాటికి ఈ భవనాన్ని ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని సూచించారు.
ఈ తనిఖీల్లో జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, అడిషనల్ కమిషనర్ రవికిరణ్‌తో పాటు ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
