సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు పనుల పరిశీలన

నాణ్యతతో పనులు పూర్తి చేయాలి: మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి

సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు పనుల పరిశీలన

​వనస్థలిపురం:

బి.ఎన్. రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాయిరాం కాలనీలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పనుల నాణ్యతను తనిఖీ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు.
​త్వరగా పూర్తి చేయాలి..
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాలనీవాసులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లెవలింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డివిజన్ అభివృద్ధికి తాము నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రతి కాలనీలో ఉన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవరెడ్డి, కల్చరల్ సెక్రటరీ శ్రీదేవి, రామ్ మూర్తి, అడ్వైజర్ జనార్ధన్, ఈసీ మెంబర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ విభాగం వర్క్ ఇన్‌స్పెక్టర్ సంజీవరెడ్డి మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు

About The Author