వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలన
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది - రాష్ట్ర మంత్రి పొన్నం

కరీంనగర్ :
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రేపు ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జిపై రిప్రజెంటేషన్ ఇస్తామని, అలాగే కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లా మధ్య ఉన్న లింక్ రోడ్డును మరమ్మతులు చేపడతామని చెప్పారు. వరదలకు కొట్టుకుపోయిన రోడ్లు ,నష్టపోయిన పంటలను మొత్తం రికార్డ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా కి సంబంధించి రైతులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందనీ చెప్పారు.
సైదాపుర్ లో ఐకేపీ కేంద్రాని పరిశీలన :
సైదాపూర్ లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని, సైదాపూర్ లోని హుస్నాబాద్- హుజూరాబాద్ రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న వరద నీటిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వరదలకు కొట్టుకుపోయిన రోడ్లు, నష్టపోయిన పంటలను మొత్తం రికార్డ్ చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశిస్తామని అన్నారు. రైతులకు ఎక్కడ ఇబ్బందులూ లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటుందని తెలిపారు. మంత్రి వెంట అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, ఆర్టీవోలు మహేశ్వర్, రమేష్ బాబు పాల్గొన్నారు.
