బడంగ్‌పేట్‌లో పారిశుధ్య పనుల పరిశీలన
మీర్పేట్:
బడంగ్‌పేట్ సర్కిల్-16 పరిధిలో ‘ప్రజా పాలన-ప్రగతి’లో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో పారిశుధ్య పనులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బుధవారం పరిశీలించారు.
మీర్పేట్ చౌరస్తా వద్ద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన ఆమె, పారిశుధ్య కార్మికులు, స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గాయత్రి నగర్ చౌరస్తా వద్ద పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. పట్టణంలో పరిశుభ్రతను మెరుగుపరచడానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.
About The Author
17 Jul 2026
