​ఆర్యవైశ్య సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ..


​ఆర్యవైశ్య సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ..

బడంగ్‌పేట్:

బడంగ్‌పేట్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్‌పేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆర్యవైశ్యులు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని, సంఘం ఐక్యంగా ఉంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆమె ఆకాంక్షించారు.
​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, గట్టు బాలకృష్ణ, బొల్లపల్లి కుమార్, ఆర్యవైశ్య సంఘం నాయకులు తోనుపునూరి శ్రీనివాస్ గుప్తా, దాచేపల్లి వెంకటేశ్వర్లు, విరమల్లి రామమూర్తి, సంఘం కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About The Author