శ్రీ పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్టకు మంత్రి వాకిటి శ్రీహరికి ఆహ్వానం
ఎల్బీనగర్:
తెలంగాణ పాలమూరు వీరుడు శ్రీ పండుగ సాయన్న విగ్రహాన్ని ఎల్బీనగర్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. బుధవారం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పశు సంరక్షణ పాడి అభివృద్ధి మత్య పరిశ్రమ క్రీడలు మరియు యువజన విభాగం శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి ముదిరాజ్ ను
కలవడం జరిగింది. శ్రీ పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్టాపనకు పూర్తిగా సహకరిస్తానని చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా మీ కమిటీకి ఏమన్నా సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకురండి తప్పకుండా వాటిని పరిష్కరిస్తానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ ఎల్బీనగర్ హైదరాబాద్ అధ్యక్షులు
గుంటి కురుమూర్తి ముదిరాజ్
గౌరవ అధ్యక్షులు బోయపల్లి లింగస్వామి గౌడ్ గౌరవ సలహాదారులు బొంత వెంకట్ ముదిరాజ్ మహిళ అధ్యక్షురాలు
లింగన్న బోయిన సీతామాలక్ష్మి ముదిరాజ్ మహిళ ఉపాధ్యక్షురాలు గద్దె రత్నకుమారి ముదిరాజ్
ఉపాధ్యక్షులు సందుల కృష్ణయ్య ముదిరాజ్ పోచన్న గారి నరసింహ ముదిరాజ్ మంత్రిని కలిసి ఆహ్వానం పలికారు.
