భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాలదారుల ఇరుముడి మహోత్సవం

WhatsApp Image 2025-12-14 at 3.09.52 PM

మణుగూరు : 
మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ ఆవరణలో గల శివాలయం పీఠం సట్టు యాకయ్య గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారుల ఇరుముడి మహో త్సవాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా నిత్య పూజలో భాగంగా అగ్రగామి గణపతి, షణ్ముఖ, అలంకార ప్రియునికి అష్టోత్తర శత నామావళి నామాలతో యాకయ్య గురుస్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కన్నె స్వాములతో మొదలుకొని గురుస్వాముల వరకు ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప మాలదారుల బంధుమిత్రులతో శివాలయం స్వామియే శరణం అయ్యప్ప అంటూ నామస్మరణంతో ఆలయం మారుమ్రోగింది. ఇరుముడి మహోత్సవాన్ని తిలకించేందుకు పట్టణ ప్రముఖులు, మణుగూరు ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు పిండిగ వెంకట్, మార్త శ్రీనివాస్ హాజరై మాలదారులకు పూలమాలలు వేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. శివాలయం పీఠం 50 రోజుల పాటు నియమ నిష్ఠలతో ఎంతో భక్తి శ్రద్ధలతో గురుస్వామి ఆధ్వర్యంలో 40 మంది అయ్యప్ప దీక్షలకు పూనుకొని మండల కాలం పూజలందుకున్నారు. ఇరుముడి కార్యక్రమం ముగిసిన అనంతరం మాలదారులు ఇరుముడిని నెత్తిన పెట్టుకొని శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నెయ్యాభిషేక ప్రియుడిని దర్శించుకునేందుకు శబరిమల బయలుదేరారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు మరెడ్ల విద్యాసాగర్ రెడ్డి, నూ తలపాటి నాగేశ్వరరావు, బోడ బాలాజీ, పెరు స్వాములు అనుమాండ్ల నరేంద్ర రెడ్డి, కనుకు రమేష్, గద, గంట, కత్తి, కన్నె స్వాములు తదితరులు పాల్గొన్నారు. 

About The Author