ఇది మధ్యతరగతి బడ్జెట్..

ఇది మధ్యతరగతి బడ్జెట్..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రధానంగా మధ్యతరగతి వర్గాలకు ఊరటనిస్తూనే, 'వికసిత్ భారత్' లక్ష్యంగా మౌలిక సదుపాయాలు మరియు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది.

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పరిమాణం రూ.50.65 లక్షల కోట్లు. ఇది గత ఏడాది కంటే సుమారు 7.4శాతం అధికం. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే, సమ్మిళిత వృద్ధికి ప్రాధాన్యతనివ్వడం ఈ బడ్జెట్ ప్రత్యేకత.

ఈ బడ్జెట్‌లో హైలైట్ అంశం ఆదాయపు పన్ను సంస్కరణలు. కొత్త పన్ను విధానంలో భారీ మార్పులు చేశారు...
 కొత్త పన్ను విధానం ఎంచుకునే వారికి రూ. 12 లక్షల వరకు ఎటువంటి పన్ను లేదు ..స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని ఇది రూ.12.75 లక్షల వరకు వర్తిస్తుంది..రూ.4 లక్షల వరకు ఆదాయంపై 0శాతం, రూ.4-8 లక్షల వరకు 5శాతం, రూ.8-12 లక్షల వరకు 10శాతం పన్నుగా నిర్ణయించారు. దీనివల్ల వేతన జీవులకు ఏడాదికి సుమారు రూ.80,000 నుండి రూ.1.1 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధికి మొదటి ప్రాధాన్యతగా గుర్తించి రూ.1.71 లక్షల కోట్లు కేటాయించారు.
 తక్కువ ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను ఎంపిక చేసి సమగ్ర అభివృద్ధి చేయడం..రుణ పరిమితిని రూ.3 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచారు.

 పప్పు దినుసుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రత్యేక మిషన్ ప్రారంభించారు.

దేశ ఆర్థిక గమనాన్ని వేగవంతం చేసేందుకు మూలధన వ్యయం  కోసం రూ.11.21 లక్షల కోట్లు  కేటాయించారు. ఇది రోడ్లు, రైల్వేలు, పోర్టుల నిర్మాణానికి ఊతమిస్తుంది.
రాష్ట్రాలకు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 1.5 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాలను 50 ఏళ్ల కాలపరిమితితో అందించనున్నారు.

- బోయనపల్లి రమణారావు, 9390267118.

About The Author

Related Posts