కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి ప్రాధాన్యత లేకపోవడం సిగ్గుచేటు: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు

కరీంనగర్, ఫిబ్రవరి 3(భారత శక్తి): తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 8200 కోట్ల రూపాయల స్కాలర్ షిప్, పిజురీఎంబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలనీ, రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నాయనడానికి మొన్న కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ నిదర్శనమని ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళ నాగరాజు ఆరోపించారు. సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా 18వ మహాసభలు ప్రారంభం అయ్యాయి…ముందుగా తెలంగాణా చౌక్ నుంచి బస్టాండ్ ప్రాంతంలోని కళాభారతి వరకు విద్యార్థి ప్రదర్శన ర్యాలి నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు అరవింద్ అధ్యక్షన జరిగిన సభలో నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్స్ విడుదల చేయడంలో పూర్తిగా విఫలమయిందని, కనీసం చదువులకు విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి విద్యార్థులకు ఏర్పడుతుందని ఆరోపించారు. విద్యార్థులు ఏ విధంగా చదువులకు ముందుకు పోగలుగుతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకుండా విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసే దుర్మార్గమైన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతుందనీ చెప్పారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం హంగులకు ఆర్భాటాలకే కేవలం పరిమితం అవుతుందే తప్ప ఏమాత్రం కూడా విద్యార్థుల సమస్యలను విని పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు.. విద్యా వ్యవస్థ అభివృద్ధి కావాలంటే విద్యా రంగానికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వాలు పనిచేయాలని, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వాలు పని చేసుకుంటున్నది తప్ప విద్యార్థుల కోసం పనిచేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, విద్యా కాషాయికరణ ప్రోత్సహిస్తూ మతకల్లోలలు సృష్టిస్తూ రోజురోజుకు దిగజారుతుందని వాపోయారు. నూతనంగా తీసుకు వస్తున్న యూనివర్సిటీలలో మార్గదర్శకాలను రద్దు చేయాలని, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని తెలియజేశారు. కనీసం కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు అని హయార్ ఎడ్యుకేషన్లో విద్యార్థులు ఏ విధంగా ముందుకు కొనసాగే ప్రయత్నం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా మహాసభల్లో విద్యారంగ సమస్యల పైన చర్చించి భవిష్యత్తు విద్యార్థులకు సమస్యల కోసం పోరాటాలను ఈ మహాసభల్లో చర్చించి పరిష్కారం కొరకు పొరడుతం అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజినీకాంత్ , రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపెల్లి పూజ, జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ , జిల్లా ఉపాధ్యక్షులు అభిలాష్, రోహిత్, ఈశక్, సహాయ కార్యదర్శులు బొగేశ్ ,శ్రీజ, నాయకులు రాజు, సన్నీ, రిషికేశ్ , ఆకాష్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.

కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి ప్రాధాన్యత లేకపోవడం సిగ్గుచేటు: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు

కరీంనగర్, ఫిబ్రవరి 3(భారత శక్తి):
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 8200 కోట్ల రూపాయల స్కాలర్ షిప్, పిజురీఎంబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలనీ, రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నాయనడానికి మొన్న కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ నిదర్శనమని ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళ నాగరాజు ఆరోపించారు. సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా 18వ మహాసభలు ప్రారంభం అయ్యాయి…ముందుగా తెలంగాణా చౌక్ నుంచి బస్టాండ్ ప్రాంతంలోని కళాభారతి వరకు విద్యార్థి ప్రదర్శన ర్యాలి నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు అరవింద్ అధ్యక్షన జరిగిన సభలో నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్స్ విడుదల చేయడంలో పూర్తిగా విఫలమయిందని, కనీసం చదువులకు విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి విద్యార్థులకు ఏర్పడుతుందని ఆరోపించారు. విద్యార్థులు ఏ విధంగా చదువులకు ముందుకు పోగలుగుతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకుండా విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసే దుర్మార్గమైన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతుందనీ చెప్పారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం హంగులకు ఆర్భాటాలకే కేవలం పరిమితం అవుతుందే తప్ప ఏమాత్రం కూడా విద్యార్థుల సమస్యలను విని పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు.. విద్యా వ్యవస్థ అభివృద్ధి కావాలంటే విద్యా రంగానికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వాలు పనిచేయాలని, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వాలు పని చేసుకుంటున్నది తప్ప విద్యార్థుల కోసం పనిచేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, విద్యా కాషాయికరణ ప్రోత్సహిస్తూ మతకల్లోలలు సృష్టిస్తూ రోజురోజుకు దిగజారుతుందని వాపోయారు. నూతనంగా తీసుకు వస్తున్న యూనివర్సిటీలలో మార్గదర్శకాలను రద్దు చేయాలని, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని తెలియజేశారు. కనీసం కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు అని హయార్ ఎడ్యుకేషన్లో విద్యార్థులు ఏ విధంగా ముందుకు కొనసాగే ప్రయత్నం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా మహాసభల్లో విద్యారంగ సమస్యల పైన చర్చించి భవిష్యత్తు విద్యార్థులకు సమస్యల కోసం పోరాటాలను ఈ మహాసభల్లో చర్చించి పరిష్కారం కొరకు పొరడుతం అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజినీకాంత్ , రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపెల్లి పూజ, జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ , జిల్లా ఉపాధ్యక్షులు అభిలాష్, రోహిత్, ఈశక్, సహాయ కార్యదర్శులు బొగేశ్ ,శ్రీజ, నాయకులు రాజు, సన్నీ, రిషికేశ్ , ఆకాష్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.

About The Author