వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయం
ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది-వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి.
వనపర్తి జిల్లా:
ప్రస్తుతం జరుగుతున్న మునిసిపాలిటీ ఎన్నికల్లో వనపర్తి, పెబ్బేరు మునిసిపాలిటీ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి భీమా వ్యక్తం చేశారు.మంగళవారం వనపర్తి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కొత్త కాపు శివసేనారెడ్డి, చిన్నారెడ్డి గార్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫాములను అందజేశారు.వనపర్తి పట్టణంలోని 33 వార్డులలో 33 వార్డులు. పెబ్బేరు మున్సిపాలిటీలోని 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అఖండ విజ యం సాధిస్తారని ఆయన అన్నారు. ప్రజలు ప్రతిపక్షాలు నమ్మే పరిస్థితిలో లేరని, గత పదివేల కాలం కేవలం ప్రతిపక్ష నాయకులే బాగుపడ్డారు తప్ప ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని నేటి ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అందుతున్నా యని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫాంలో పొందిన ప్రతి కౌన్సిలర్ అభ్యర్థులందరినీ గెలిపించి తీరుతామని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, డిసిసి అధ్యక్షులు శివసేన రెడ్డితో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు ఆయన బీఫాంలో పంపించేశారు.
