సీఎం హెలిపాడ్ కోసం తాటి చెట్లు నరకడం సరికాదు
- గీత కార్మికుల పొట్ట కొడితే ఊరుకోం
- తాటి చెట్ల నరికివేతను విరమించుకోవాలి
- మండల బిఆర్ఎస్ అధ్యక్షులు లింగం గౌడ్ డిమాండ్
భారత శక్తి :
సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా గీత కార్మికులకు ఉపాధినిచ్చే తాటి చెట్లను తొలగించడం కార్మికుల పొట్ట కొట్టడమేనని మండల బిఆర్ఎస్ అధ్యక్షులు అనగోని లింగం గౌడ్, నంగునూరు సహకార సంఘం మాజీ చైర్మన్ కోల రమేష్ గౌడ్ అన్నారు. నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22న ప్రారంభిస్తున్న సందర్భంగా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న తాటి చెట్లను కొట్టి గీతా కార్మికుల పొట్ట కొట్టడం సబబు కాదని తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం నర్మెట గీతా కార్మికులతో కలిసి తాటి చెట్ల తొలగింపును అడ్డుకొని మాట్లాడారు. గ్రామంలో ఫ్యాక్టరీ ఏర్పాటయితే దాని చుట్టుపక్కల ఉన్న తాటి చెట్లతో గీతా కార్మికులకు ఎంతో ఉపాధి లభిస్తుందని ఆశించారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ దిగేందుకు గీతా కార్మికులకు ఉపాధి నిచ్చే తాటి చెట్లను కొట్టేందుకు అధికారులు ఏర్పాటు చేయడం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వ పాలనలో గీత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు గ్రామ గ్రామాన తాటి ఈత మొక్కలు నాటి ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ కూడా ఒక ఈత మొక్క కానీ తాటి మొక్క గాని నాటిన పాపాన పోలేదని మండిపడ్డారు. సీఎం హెలిప్యాడ్ దిగేందుకు అనువైన ప్రాంతం ఫ్యాక్టరీ వెనుక భాగంలో ఉన్నప్పటికీ ఫ్యాక్టరీ పక్కనే ఉన్న రైతు పొలాలలోని తాటి చెట్లను తొలగించాలని అధికారులు ప్రయత్నాలు చేయడం తగదు అన్నారు. గ్రామంలో సుమారుగా 60 మంది గితా కార్మికులు కులవృత్తి అయిన తాటి చెట్లపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తాటి చెట్ల తొలగింపు చర్యను మానుకొని వేరే ప్రాంతంలో హెలిపాడ్ దిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంగునూరు సహకార సంఘం మాజీ చైర్మన్ కోల రమేష్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు పుప్పాల నారాయణ, ఉపాధ్యక్షులు శ్రీకాంత్,, గీత కార్మిక సహకార సంఘం నాయకులు, యాదగిరిగౌడ్ రాములు గౌడ్, శేఖర్ గౌడ్, సురేష్ గౌడ్, నాయకులు సతీష్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్, చింటూ గౌడ్, తదితరులు పాల్గొన్నారు..jpeg)
