కాటన్ మిల్లుల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి

రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ : గోపి

WhatsApp Image 2025-10-23 at 6.42.58 PM

సూర్యాపేట : 

Read More అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

కాటన్ మిల్లుల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు పత్తి కొనుగోలు చేసేలా చూడాలని, కిసాన్ కపాస్ యాప్ పై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి సూచించారు.గురువారం ఆయన  సూర్యాపేట మండలం, బాలెంలలోని మంజిత్ కాటన్ ఫ్యాక్టరీ ని  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి  సందర్శించారు. మాయిచర్ మిషన్ ద్వారా పత్తి తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులు పత్తిని గ్రామంలోనే ఆరబెట్టుకొని తీసుక  రావాల్సిందిగా కోరినారు. 8 శాతం ఉన్న పత్తికి ప్రభుత్వం మద్దతు ధర 8110/-  చెల్లిస్తుంది తెలిపినారు.ఈ సంవత్సరం సి సి ఐ నూతన పద్దతిలో పత్తి కొనుగోలు చేయాలని సూచనలు చేసిందని ,కిసాన్ కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని పత్తిని విక్రయించుకోవచ్చని తెలిపారు.కిసాన్ కపాస్ యాప్ ద్వారా గ్రామాల వారీగా రైతులు ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలో వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని, జిల్లాలోని పత్తి రైతులు అందరు చరవాణి నంబర్లు అప్ డేట్ చేయాలని చెప్పారు.తదుపరి బాలెంల రైతు వేదిక లో వ్యవసాయ శాఖ అలాగే మార్కెటింగ్ శాఖ అధికారులతో ఆయా శాఖల పురోగతి పై సమావేశం నిర్వహించారు.జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ, మండల వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు

Read More తుది మెరుగులు దిద్దుకుంటున్న బ‌మృక్‌నుద్దౌలా చెరువు

About The Author