రంజిని తాండ నూతన గ్రామపంచాయతీకి సర్పంచ్‌గా జాదవ్ సవితాబాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :
కుబీర్ మండలంలోని రంజిని తాండ నూతనంగా గ్రామపంచాయతీగా ఏర్పడిన నేపథ్యంలో తొలిసారి నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో జాదవ్ సవితాబాయి బన్సీలాల్ సర్పంచ్‌గా, రంగారావు ఉప సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు.గ్రామ ప్రజలు భారీ మెజారిటీతో ఓటు వేసి వీరిని గెలిపించడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీకి తొలి సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన జాదవ్ సవితాబాయి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
నూతన గ్రామపంచాయతీ ఏర్పాటుతో రంజిని తాండ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
About The Author
17 Jul 2026
