
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :
భైంసా మండల నూతన ఎంపీ ఓ (మండల పరిషత్ అభివృద్ధి అధికారి)గా జాదవ్ ప్రదీప్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జాదవ్ ప్రదీప్ గతంలో 2019 సంవత్సరంలో ఖత్గాం గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. ఇటీవల జరిగిన గ్రూప్-2 పరీక్షలో ర్యాంకు సాధించి ఎంపీ ఓగా ఎంపిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. “గ్రూప్-2లో ర్యాంకు రావడంతో ఈ పదవి రావడం నాకు గర్వకారణం. ఇదే మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన నేను ఇప్పుడు ఎంపీ ఓగా నియమితులవడం విశేషంగా అనిపిస్తోంది,” అని జాదవ్ ప్రదీప్ తెలిపారు.మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు.