నవంబర్ 3న జరిగేకలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి

తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

WhatsApp Image 2025-11-02 at 5.38.13 PM

సూర్యాపేట : 

Read More ఎన్నికలలో రిటర్నింగ్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

మొంథా తుపాన్‌ ప్రభావంతో  భారీ వర్షాలు,వరదలు ,ఈదురు  గాలులు వల్ల జిల్లా వ్యాప్తంగా వేలాదిఎకరాల్లో  వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు  నష్టపోయాయని దెబ్బతిన్న పంటలను సర్వే జరిపి రైతాంగానికి  నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 3న సూర్యాపేట కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. తూఫాన్ వలన వరి కోత సమయం లో క్రింద పడి మొకాలు లోతు వర్షం నీరు నిల్వ ఉండి మొలకలు వచ్చాయి అని అన్నారు. కొన్ని పంటలు ఎందుకు పనికి రాకుండా పోయినాయి అన్నారు.నష్ట పరిహారాల నమోదులో స్వంత భూములు కలిగిన సాగు దారుల తోపాటు వాస్తవ సాగు దారులైన కౌలు రైతులను గుర్తించి పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో వరి, మిర్చి, పత్తి,కూరగాయల పంటలు  తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి ముందస్తుగా కౌలు చెల్లించి పంటలు పండించారని, చేతికొచ్చే సమయానికి తుఫాను ప్రభావం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన దెబ్బతిన్న అన్ని పంటలను సర్వే చేసి  ఎకరానికి ఆహార పంటలకు రూ. 50,000 వాణిజ్య పంటలకు రూ. 75000,  ఉద్యాన పంటలకు రూ.లక్ష  చొప్పున పరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని  డిమాండ్ చేశారు. మండలాలలో  పంట ముప్పై మూడు శాతం దెబ్బతింటే  మాత్రమే  పంటల పరిహారం అందించే నిబంధనలు సడలించి  గ్రామం, సర్వే నెంబర్ ఆధారంగా దెబ్బతిన్న పంట నమోదు చేసి పరిహారం అందించాలి అని కోరారు, సిసిఐ కొనుగోలు నిబంధనలు సడలించి రంగు మారిన పత్తిని, గుడ్డుపత్తిని, మరియు వరి ధాన్యాన్ని మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.. 

Read More కాంగ్రెస్ లో చేరిన బద్దిపల్లి, బహదూర్ఖాన్ పేట స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థులు

About The Author