
ఖమ్మం ప్రతినిది : ::
కార్తీక మాసంలో పూజలు,వన భోజనాలతో పుణ్యఫలం దక్కుతుందని ఆర్యవైశ్య మండల అధ్యక్షులు చెడే వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని వైరా జగ్గయ్యపేట ప్రధాన రహదారి పక్కన గల మామిడి తోటలో ఆర్యవైశ్య వన సమారాధన జరిగింది.ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా జిల్లా ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులు పసుమర్తి రామచంద్రరావు, చింతకాని మండలం ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడు నాగుబండి వెంకటనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య కులస్తులు అన్నిరంగాల్లో ఆర్థికంగా ఉన్నవారే అధికంగా ఉన్నారని, అంతా ఐక్యమత్యంగా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలన్నారు.
ఐక్యమత్యంగా ఉంటే సమాజంలో ఏదైనా సాధించవచ్చని అన్నారు. అంతకుముందు వనంలో ఏర్పాటు చేసిన సత్యనారాయణ స్వామి వ్రతము చేసి ప్రత్యేక పూజలు చేశారు. సీనియర్ జర్నలిస్ట్ తేనె వెంకటేశ్వర్లు ను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు,అనంతరం సంఘం ఆధ్వర్యంలో ఉసిరి చెట్టును నాటారు,ఈ సందర్భంగా చిన్నపిల్లలు,మహిళలు ఆధ్వర్యంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.ఈ కార్యక్రమంలో గుర్రం పూర్ణయ్య,పల్లపోతుల గోపి,రంగా జనార్ధన్,చెన్నా సుధీర్,మిర్యాల రవి,తెల్లాకుల శ్రీనివాసరావు,కలవల బాబు,కొణతాలపల్లి నాగేశ్వరరావు,సుగ్గల బ్రహ్మం ,కటకం శ్రీనివాసరావు,బచ్చు వెంకటేశ్వరరావు బోనకల్ మండల ఆర్య వైశ్యులు తదితరులు ఉన్నారు.