ఉద్యమకారులకు అండగా కవితక్క పోరాటం..! ​కవితక్కకు అధ్యయన నివేదిక అందజేత

కాంగ్రెస్‌ తీరుపై కప్పాటి పాండురంగారెడ్డి విమర్శలు

ఉద్యమకారులకు అండగా కవితక్క పోరాటం..!  ​కవితక్కకు అధ్యయన నివేదిక అందజేత

హైదరాబాద్‌:

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ప్రస్తుత ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారుల స్థితిగతులపై ‘తెలంగాణ జాగృతి ఉద్యమకారుల సంక్షేమ కమిటీ’ నిర్వహించిన క్షేత్రస్థాయి అధ్యయన నివేదికను సోమవారం హైదరాబాద్‌లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు అందజేశారు.

​క్షేత్రస్థాయిలో కష్టాల కడలి:

​రాష్ట్రంలోని ఉద్యమకారులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక ఇబ్బందులపై కమిటీ సభ్యులు లోతైన అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. "ఉద్యమ సమయంలోనూ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారులు అనేక కష్టనష్టాలకు గురవుతున్నారు. వారి సంక్షేమం కోసం కవితక్క నిరంతరం కృషి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలను, వాటికి కావాల్సిన పరిష్కార మార్గాలను ఈ నివేదికలో పొందుపరిచాం" అని వివరించారు.

​సర్కారుపై విమర్శలు:

​అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. దగా పడ్డ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ఉద్యమకారుల సంక్షేమం కోసం కవిత చేపట్టబోయే భవిష్యత్తు కార్యాచరణకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యమ సంఘాలు, కార్యకర్తలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

​ఈ కార్యక్రమంలో అధ్యయన కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి బండారి శ్రీనివాస్ గౌడ్, ములుగు జిల్లా అధ్యక్షుడు నంగావత్ రాజేష్, శీలం వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి స్టీరింగ్ కమిటీ ప్రతినిధుల సమక్షంలో ఈ నివేదికపై సుదీర్ఘంగా చర్చించారు.

About The Author