విశ్వ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు
ఎల్బీనగర్:
చైతన్యపురి డివిజన్ పరిధిలో భారాస యువ నాయకుడు విశ్వ ప్రేమ్ కుమార్ ఆదాలత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72వ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో భారాస పార్టీ పెద్దలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని ఆనందభరితంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ వేడుకలో తోట మహేష్ యాదవ్, సొంటి చంద్రశేఖర్, కోతి నర్సిరెడ్డి, శివ ప్రకాష్, త్రివేది, గానుగపేట నరేష్, చిన్న యాదవ్, శ్రీనివాస్ యాదవ్, జలందర్, ఈశ్వర్ గౌడ్, లక్ష్మీనారాయణ, చిన్న హరి, శ్రీహరి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
About The Author
18 Feb 2026
