10 అత్యాధునిక దోమల ఫాగింగ్ యంత్రాలు ప్రారంభం
సర్కిల్ కార్యాలయంలో ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి...జోనల్ కమీషనర్ హేమంత్ కేశవ్ పాటిల్
ఎల్బీనగర్:
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కాలనీలలో దోమల వ్యాప్తి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి అత్యాధునిక జర్మనీ టెక్నాలజీ కలిగిన దోమల ఫాగింగ్ యంత్రాలు దోహదపడనున్నాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.శుక్రవారం సరూర్ నగర్ సర్కిల్స్ కార్యాలయాల ఆవరణలో జర్మనీ టెక్నాలజీతో రూపొందించిన 10 దోమల ఫాగింగ్ మిషన్ల ఎలక్ట్రిక్ వాహనాలను ఆయన జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఒక్కో వాహనాన్ని రూ.13.5 లక్షలతో కొనుగోలు చేసినట్లు తెలిపారు.ఇప్పటి నుండి అయిన నియోజకవర్గం ప్రజలు దోమల భాద నుండి విముక్తి పొందాలని, ఇక నుండి ప్రతి డివిజన్ లో దోమల నివారణ చర్యలు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఛైర్మెన్ కాసుల బాలరాజు, జనరల్ మేనేజర్ మహ్మద్ యూనిస్, అసిస్టెంట్ ఏఎంహెచ్ఓ కమిషనర్ రఘుప్రసాద్, డిప్యూటీ కమిషనర్లు బోనగిరి శ్రీనివాస్, వంశీకృష్ణ, నిత్యానంద్, జకీయా సుల్తానా, శైలజ, సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవరెడ్డి, ఏఎంహెచ్ఓ డాక్టర్ దీప్తి,డిఈఈ చందన ప్రాజెక్ట్ ఆఫీసర్ విక్రాంత్ రెడ్డి, ఎంటమాలజీ ఏఈ తేజస్వి ఇతర అధికారులు పాల్గొన్నారు.
