చైతన్యపురిలో ‘రైస్ స్కిన్ హెయిర్ క్లినిక్’ ప్రారంభం

  • వైభవంగా 5వ బ్రాంచ్ ప్రారంభోత్సవం
  • అందుబాటులోకి అత్యాధునిక చర్మ, కేశ సంరక్షణ సేవలు
  • ​త్వరలో ఉచిత వైద్య శిబిరాలు: ఎండీ డా. క్రాంతి కుమార్ గుప్తా

చైతన్యపురిలో ‘రైస్ స్కిన్ హెయిర్ క్లినిక్’ ప్రారంభం

ఎల్బీనగర్:

చర్మ మరియు కేశ సంరక్షణ రంగంలో విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ‘రైస్ స్కిన్ హెయిర్ క్లినిక్’ తమ సేవల విస్తరణలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. చైతన్యపురిలోని శివాజీ బొమ్మ సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన క్లినిక్ 5వ బ్రాంచ్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన బంధుమిత్రులు, వైద్య నిపుణులు జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి క్లినిక్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

​26 ఏళ్ల నమ్మకం.. ఆధునిక వైద్యం:

ఈ సందర్భంగా క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ క్రాంతి కుమార్ గుప్తా మాట్లాడుతూ.. గత 26 ఏళ్లుగా రోగుల నమ్మకాన్ని చూరగొంటూ నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా, మానవతా దృక్పథంతో బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నూతన బ్రాంచ్‌లో అత్యాధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన డెర్మటాలజిస్టులు మరియు శిక్షణ పొందిన మెడికల్ టీమ్ అందుబాటులో ఉంటారని వెల్లడించారు.

​అందుబాటులో ఉన్న ప్రధాన చికిత్సలు:

క్లినిక్‌లో వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా (Customized Treatments) కింది సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు,

​చర్మ సమస్యలు: మొటిమలు, మచ్చలు, వార్ట్స్, స్కిన్ అలర్జీలు, పిగ్మెంటేషన్.

​అత్యాధునిక సేవలు: యాంటీ ఏజింగ్, కెమికల్ పీల్స్, లేజర్ ట్రీట్మెంట్స్.

​కేశ సంరక్షణ: హెయిర్ ఫాల్ కంట్రోల్ థెరపీ, జుట్టు రాలడం నివారణకు ప్రత్యేక చికిత్సలు.
​త్వరలోనే సామాజిక బాధ్యతలో భాగంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు డా. క్రాంతి కుమార్ గుప్తా ప్రకటించారు. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్‌ల ద్వారా సేవలను విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా నాణ్యమైన స్కిన్ కేర్ సేవలు అందుబాటులోకి రావడం పట్ల చైతన్యపురి వాసులు హర్షం వ్యక్తం చేశారు.

About The Author