భూపాలపల్లి జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చుదాం

భూపాలపల్లి :

WhatsApp Image 2025-10-21 at 8.25.58 PM

కాటారం మండలంలోని మేడిపల్లి గ్రామంలో మాదకద్రవ్య రహిత జిల్లాగా మారేందుకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చర్యలు ముమ్మరం అవుతున్నాయి. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి శ్రీమతి మల్లేశ్వరి ఆదేశాల మేరకు “మిషన్ పరివర్తన్” కార్యక్రమాన్ని మంగళవారం కాటారం మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించడం జరిగింది.

Read More సకాలములో గుండె ఆపరేషన్ నిమిత్తమై "ఓ" పాజిటివ్ రక్తం అందజేత

ఈ కార్యక్రమంలో మిషన్ పరివర్తన్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్  ప్రసాద్ మాట్లాడుతూ, “మాదకద్రవ్యాల వినియోగం సమాజాన్ని, ముఖ్యంగా యువతను నాశనం చేస్తోందని తెలిపారు. మన అందరి భాగస్వామ్యంతోనే మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించగలమని తెలిపారు. ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ఈ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వలన కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక ప్రభావాలపై వివరించారు. మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగం జరిగితే వెంటనే *100, **14446, **1908* నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Read More పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

తదుపరి మహిళ సాధికారత సిబ్బంది అనూష, “బేటీ బచావో – బేటీ పడావో” కార్యక్రమం గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, బాలికల రక్షణ, విద్యా ప్రాముఖ్యత, మరియు మహిళా సాధికారతపై చర్చించారు.

Read More మత్స్యకారులు మత్స్య సంపదపై దృష్టి సాధించాలి : జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, మరియు మహిళా సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరూ కలసి మాదకద్రవ్య రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేసి, “మనం మారుదాం – సమాజాన్ని మార్చుదాం” అనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.

Read More కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆవాల సరోజ మృతి

About The Author