ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలి: మధు యాష్కి గౌడ్
మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్‌కు కాంగ్రెస్ నేతల వినతి
మల్కాజిగిరి:
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కోరారు. మంగళవారం తార్నాకలోని మున్సిపల్ కార్యాలయంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ నేతృత్వంలోని ప్రతినిదూల బృందం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
ప్రజా సమస్యలే అజెండాగా..
ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డిలతో కలిసి మధుయాష్కి గౌడ్ స్థానిక సమస్యలపై కమిషనర్‌తో చర్చించారు. నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాల కొరత, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, రహదారుల మరమ్మతులు వంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించిన నేతలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్‌ను కూడా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, బొంతు శ్రీదేవి, రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే ఎల్బీనగర్ నియోజకవర్గ డివిజన్ల అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, దెంది శశిధర్ రెడ్డి, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, బుడ్డా సత్యనారాయణ, గణేష్ నాయక్, దేవాలయ కమిటీల డైరెక్టర్ కంచర్ల కవిత, నాయకులు గణేష్ రెడ్డి, భీమిలి రామకృష్ణారెడ్డి, కొండోజు శ్రీనివాస్, సురేష్ యాదవ్, రేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
.jpeg)
