మహిళా సున్వాయ్‌కు నేడు శ్రీకారం
మల్కాజిగిరి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న 'మహిళా జన్ సున్వాయ్'లో భాగంగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గురువారం ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ రహత్కర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు.
మహిళల సమస్యలను నేరుగా విని, వాటి పరిష్కారానికి ఈ కార్యక్రమం వేదిక కానుంది. జిల్లాలోని మహిళలు తమ సమస్యలపై ఫిర్యాదులను నేరుగా సమర్పించుకోవచ్చని, వాక్-ఇన్ పద్ధతిలో అందే ఫిర్యాదులను కూడా స్వీకరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
About The Author
13 Mar 2026
