వెట్టి చాకిరీ (రద్దు) చట్టం–1976 కు 50 సంవత్సరాలు పూర్తి సందర్భంగా సమావేశం

వెట్టి చాకిరీ (రద్దు) చట్టం–1976 కు 50 సంవత్సరాలు పూర్తి సందర్భంగా సమావేశం

ఎల్బీనగర్:

రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మరియు దివ్య దిశ ఎన్జీఓ సహకారంతో వెట్టి చాకిరీ (రద్దు) చట్టం–1976 అమలులోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా న్యాయ సేవా సదన్‌లో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి అనుష మాట్లాడుతూ,వెట్టి చాకిరీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలు, కార్మికులకు కల్పించిన హక్కులు మరియు రక్షణ చర్యల గురించి వివరించారు. వెట్టి చాకిరీ వ్యవస్థ నిషేధం, బాధితులకు అందించే ఆర్థిక సహాయం, పునరావాస సౌకర్యాలపై పాల్గొన్న వారికి సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏ. సత్యనారాయణ,షాద్నగర్  తహశీల్దార్ సీహెచ్ నాగయ్య, సీడీపీఓ ప్రవీణ్ కుమార్, దివ్య దిశ ఎన్జీఓ డైరెక్టర్ ఫిలిప్స్ ఐసిడోర్,ఎల్బీనగర్ సీఐ వినోద్ కుమార్, న్యాయ సేవ సంస్థ సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.

About The Author