సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన : మంత్రి సీతక్క.

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన : మంత్రి  సీతక్క.

మేడారం/ములుగు :

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు ఈ నెల 18న  రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రానున్నారు. పర్యటన ఏర్పాట్లను శుక్రవారం  రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క , జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ లతో కలిసి పరిశీలించారు.
ముఖ్య అతిధుల కోసం ఏర్పాటు చేస్తున్న హెలిపాడ్ స్థలాన్ని, టెంట్ సిటీ , సాంసృతిక కార్యక్రమాల సభ ప్రాంగణాన్ని, క్యూ లైన్స్ షేడ్స్, మీడియా టవర్ నిర్మాణాలను, ప్రధాన ఆర్చి ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క అధికారులతో మాట్లాడుతూ ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు శనివారం సాయంత్రం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సభ ప్రాంగణ పరిసరాలలో రాతి నిర్మాణాల వ్యర్ధాలను వెంటనే తొలగించాలని రహదారుల వెంట భక్తులకు త్రాగునీరు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు,ఆర్ డి ఓ వెంకటేష్, డీఎస్పీ రవీందర్ ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts