జాబ్ మేళ వివరాలను తెలియజేసిన- మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

WhatsApp Image 2025-10-26 at 2.08.43 PM

సూర్యాపేట : 

Read More హరీష్ రావును కలిసిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్

హుజూర్నగర్ లో ఈనెల 25న నిర్వహించిన మెగా జాబ్ మేళా కు చెందిన వివరాలను అదే రోజు సాయంత్రం మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వెల్లడించారు.ఉద్యోగాల కై ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న 40 వేల మంది అభ్యర్థులలో  20463 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారని,అందులో 3041 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు  తెలిపారు.మెగా జాబ్  మేళాకు ఆన్లైన్ ద్వారా 40 వేల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అయా విభాగాల వారిగా ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులు, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఆయన తెలియజేశారు.ఐటీ ,ఎడ్యు టెక్నాలజీ స్కిల్స్ ట్రైనింగ్  విభాగంలో ఇంటర్వ్యూలకు 5547 మంది అభ్యర్థులు హాజరు కాగా,  827 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని,మరో  370 మంది అభ్యర్థుల ఉన్నత  అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ జాబితాను రూపొందించినట్లు తెలిపారు.అలాగే సర్వీస్ మొబైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 3850 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా, 391 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారని, 804 మంది అభ్యర్థుల షార్ట్ లిస్టు రూపొందించినట్లు తెలిపారు.

Read More పోలీసు ప్రతిష్టను కించపరిచేలా తప్పుడు సమాచారం ప్రసారం చేయవద్దు

మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నికల్ రంగంలో  4520 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా, 610 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు.బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ విభాగంలో  2440  మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా ,713 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.

Read More అనాధలు, పసిపిల్లల ప్రాణాలతో వికృత ఆట..

ఫార్మా హెల్త్ కేర్  హాస్పిటాలిటీ విభాగంలో 2167 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా, 210 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని, మరో 195 మంది అభ్యర్థుల షార్ట్ లిస్టును రూపొందించామని చెప్పారు.ఆటోమొబైల్స్ రంగంలో 952 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా,102 మంది ఉద్యోగాలకు ఎంపిక  అయ్యారని,154 మంది అభ్యర్థుల షర్ట్ లిస్టును సిద్ధం చేశామని తెలిపారు.లాజిస్టిక్ ఎయిర్ పోర్ట్ రంగంలో 1047 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా,188 మంది అభ్యర్థులు ఉద్యోగాలు కు ఎంపిక అయ్యారని,10 మంది అభ్యర్థుల షార్ట్ లిస్టును రూపొందించినట్టు చెప్పారు.జాబ్ మేళాకు ఆన్ లైన్ ద్వారా 40 వేల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా,20463 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు అయ్యారని,అందులో  3041 మంది ఉద్యోగాలకు ఎంపిక  అయ్యారని,మరో 1533 మంది అభ్యర్థుల షార్ట్  లిస్ట్ జాబితాను రూపొందించినట్టు పునరుద్ఘాటించారు.ముందుగా జాబ్ మేళా ను రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ,ఇతర ప్రదేశాలలో జాబ్ మేళా నిర్వహించవలసి ఉన్న కారణంగా కొన్ని కంపెనీలు మాత్రమే ఆదివారం జాబ్ మేళాకు హాజరవుతున్న దృష్ట్యా  ఆదివారం నిర్వహించదలచిన  జాబ్ మేళాను వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు. తిరిగి ఈ జాబ్ మేళాను ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.హుజూర్ నగర్ లో నిర్వహించిన   జాబ్ మేళాను  విజయవంతం చేయడంలో  సహకారం అందించిన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులు,సిబ్బంది  అందరికీ ఆయన  కృతజ్ఞతలు తెలియజేశారు.. 

Read More కార్తీక పౌర్ణమి వేడుకల్లో దీపాలు వెలిగించిన జగ్గారెడ్డి

About The Author