దళిత జర్నలిస్టు ఫోరం గౌరవ అధ్యక్షులుగా మంత్రి వివేక్ వెంకటస్వామి

దళిత జర్నలిస్టు ఫోరం సభ్యులకు తన సంపూర్ణ మద్దతు
గడ్డం వివేక్ వెంకటస్వామి కార్మిక, మైనింగ్ శాఖ, జియాలజీ శాఖ మంత్రి

WhatsApp Image 2025-11-20 at 6.23.32 PM

హైదరాబాద్ : 

దళిత జర్నలిస్టు ఫోరం గత పదేళ్లలో జర్నలిస్టుల హక్కుల కొరకై ఎంతో పోరాటం చేశామని, దళిత జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్ అన్నారు. దళిత జర్నలిస్ట్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా కార్మిక, మైనింగ్ శాఖ, మరియు జియాలజీ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు, దళిత జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్ తెలిపారు. ఈ సందర్భంగా గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... దళిత జర్నలిస్టు ఫోరం సభ్యుల డిమాండ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వారి సమస్యలను పరిష్కరిస్తారని, ఫోరం సభ్యులకు తను ఎల్లవేళలా సహకరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్ట్ ఫోరం తెలుగు రాష్ట్రాల వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదగిరి, మీసాల ఎల్లేష్, శ్రీకాంత్, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు దొమ్మాట శివకుమార్, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు రాపాక విజయ రాజు, పెద్దిగారి స్వామి రాష్ట్ర కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు 

About The Author