నూతన సర్పంచులను సన్మానించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి :
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన నూతన సర్పంచులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచులను చింతా ప్రభాకర్ ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధికి తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపును కృషి చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు అభినందించారు. గత ప్రభుత్వంలో గ్రామపంచాయతీలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. కెసిఆర్ పాలనని ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. హరిదాస్ మారేపల్లి తమ్ములబాయి తండా మారేపల్లి మాచిరెడ్డిపల్లి చర్లగూడెం సర్పంచులు వార్డు సభ్యులు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు.
About The Author
17 Jul 2026
