క్రికెట్ విజేతలకు ట్రోపీ బహుకరించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి :

WhatsApp Image 2025-10-21 at 7.02.19 PM

సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ గ్రామ శివారులోని క్రికెట్ మైదానంలో ఘనంగా జరిగిన అంబేద్కర్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న అన్ని జట్ల ఆటతీరును అభినందిస్తూ,విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, మెడల్స్, నగదు బహుమతులు అందజేశారు.మొదటి స్థానంలో ఇంద్రకరణ్ గ్రామానికి చెందిన గేమ్ చేంజర్ టీం విజతలుగా నిలిచారు.వారికి రూ. 33వేల నగదు ట్రోపి అందజేశారు.రన్నరప్ గా ఇంద్రకరణ్ గ్రామానికి చెందిన అంబేద్కర్ టీం నిలిచింది. వారికి రూ. 22 వేల నగదు ట్రోపి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, జట్టు స్పూర్తి, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని తెలిపారు. యువత తమ ప్రతిభను చూపేందుకు ఇలాంటి టోర్నమెంట్‌లు వేదికగా నిలుస్తాయని, క్రీడలను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటామని పేర్కొన్నారు.

Read More స్నేహిత ద్వారా విద్యార్థులకు ధైర్యం, భరోసా కల్పించాలి

About The Author