నూతన కాలనీలకు మంచి నీరు అందించండి జలమండలి ఎండి అశోక్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు:
పటాన్‌చెరు నియోజకవర్గంలోని జలమండలి పరిధిలోగల నూతన కాలనీలకు సైతం రక్షిత మంచినీరు అందించేందుకు నిధులు కేటాయించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జలమండలి ఎండి అశోక్ రెడ్డిని కోరారు.
గురువారం హైదరాబాద్ లోని జలమండలి కార్యాలయంలో ఎండి అశోక్ రెడ్డి ని కలిసి వివిధ అంశాలపై చర్చించారు.
ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎండి అశోక్ రెడ్డి.. అతి త్వరలో నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ పేర్కొన్నారు.
About The Author
10 Apr 2026
