ఇస్నాపూర్ మల్లన్న స్వామి జాతర్లు పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు:
ఇస్నాపూర్ మున్సిపల్ కేంద్రంలో గల మల్లన్న స్వామి దేవాలయంలో సోమవారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ సమేతంగా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, శ్రీ కామరతి సమేత బీరప్ప స్వామి కళ్యాణం, జాతర మహోత్సవంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కురుమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుమలత, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
About The Author
21 Apr 2026
