
కామారెడ్డి జిల్లా :
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ తెలంగాణ రాష్ట్ర కొత్త మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీ మొహమ్మద్ అజహరుద్దీన్ ని కలసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, అజహరుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి విశేషమైన సేవలు అందించారు. క్రీడలలోనే కాదు, ప్రజాసేవలోనూ ఆయనకు విశేషమైన అనుభవం ఉంది. ఆయన మంత్రిగా నియమించబడడం రాష్ట్రానికి మేలుచేసే నిర్ణయం. పార్టీ బలోపేతానికి, యువతకు స్ఫూర్తిగా నిలుస్తారు” అని తెలిపారు.