పరమేశ్వరుడికి అభిషేఖం నిర్వహించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి_
మహేశ్వరం:
మహేశ్వరం గ్రామంలో గల శివగంగ రాజ రాజేశ్వరి దేవాలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పరమేశ్వరుడికి ప్రత్యేక అభిషేఖ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు పట్లోళ్ల కౌశిక్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ, పరమేశ్వరుడి కృపాకటాక్షం ఎల్లవేళలా అందరిపై ఉండాలని, పాడిపంటలు సస్యశ్యామలంగా ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అలాగే సబితా ఇంద్రారెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
16 Feb 2026
