ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్:
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా యువకులతో భారీ ర్యాలీతో మన్సూరాబాద్ డివిజన్ జడ్జెస్ కాలనీలో ఉన్న శివాజీ మహారాజ్ విగ్రహానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ప్రారంభించారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, హిందూ స్వరాజ్య స్థాపకుడు, ధైర్యసాహసాల ప్రతీక, ప్రజాహిత పరిపాలనకు ఆదర్శప్రాయుడైన మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి తన వినమ్ర నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఆయన దేశభక్తి, పరాక్రమం, ధర్మ బద్ధమైన పాలన నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొప్పుల విఠల్ రెడ్డి,జక్కిడి మల్లారెడ్డి, జగదీష్ యాదవ్,జక్కిడి రఘువీర్ రెడ్డి పలువురు సీనియర్ నాయకులు, కాలనీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు,పార్టీ అభిమానులు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
