స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్ పరిశీలించిన ఎంఎంసీ కమీషనర్
ఎల్బీనగర్:
జనాలను మోసం చేస్తూ, కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తూ,వారి స్వార్థం కోసం, అనుకూలంగా ఉన్న వారికి ఉపయోగపడేలా స్ట్రోమ్ వాటర్ లైన్ వేస్తున్నారని, కానీ ఆ పేరు చెప్పి డ్రైనేజీ కోసమే పైపు లైన్లు వేస్తున్నారని, ఇది రియల్ ఎస్టేట్ కంపెనీకి ఉపయోగపడేలా ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని, అలాగైతే రోడ్డు వెడల్పు కోసం రెడ్ మార్కులు వేసిన అధికారులు ఒక్కసారే రోడ్డు వైండింగ్ ను, పైపు లైన్లు వేయాలని కొందరు కేంద్ర పార్టీ ప్రతినిధులు, అదేమీ లేదు ప్రజల అవసరాల కోసం, వారి భవిష్యత్ కోసమే లైన్లు వేస్తున్నామని రెండు అధికార, జాతీయ రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న గొడవ, మధ్యలో జనాలకు నిద్ర లేకుండా చేస్తుంది. ట్రాఫిక్ కష్టాలతో, ఏ క్షణం ఎవరు వచ్చి మా ఇండ్లను కూలగొట్టి పోతారనే భయంతో సరూర్నగర్ ప్రజలు బిక్కుబిక్కుమంటున్న, ఈ సందర్బంగా ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సరూర్ నగర్ మండలం లింగోజిగూడ డివిజన్ ప్రియదర్శిని పబ్లిక్ పార్క్ వద్ద జరుగుతున్న స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్ పనులు,పాత పోస్ట్ ఆఫీస్ నుండి ప్రియదర్శిని పార్క్ వరకు కాలినడకన అన్నీ పరిశీలించుకుంటూ, శానిటేషన్, డస్ట్ బీన్ నిర్వాహణ, ఇంటింటికి చెత్త సేకరణ, వాణిజ్య దుకాణాలు, వీధి వ్యాపారం చేసే వారిని రోడ్డు మీద చెత్త వేయకుండా చెత్త ఆటో వారికి అటాచ్ చేయడం, విద్యుత్ స్థంభాల మీద వేలాడుతున్న కేబుల్ వైర్లను తొలగించడం గురించి తనతో ఉన్న అధికారులకు వివరించారు.ఈ కార్యక్రమంలో సరూర్నగర్ సర్కిల్ 12, ఎల్బీనగర్ సర్కిల్ 13 ఇంచార్జి డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, ఈఈ కార్తీక్, డిప్యూటీ ఈఈ చందన, రాంకీ ఎంఎంసీ అధికారి, ఎస్ఎస్ బుచ్చయ్య, ఎస్ఎఫ్ఏలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
