చీఫ్ జస్టిస్ పై దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ ర్యాలీని విజయవంతం చేయాలి

- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ*


WhatsApp Image 2025-10-30 at 7.32.43 PM

సంగారెడ్డి : 

Read More హైడ్రా తన లక్ష్యాన్ని చేరుకుందా..?

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీహార్ గవాయ్ దాడి ఘటన మీద కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ఎమ్మార్పీఎస్ నాయకులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రెడ్లస్ హోటల్ లో జిల్లా అధ్యక్షుడు మైసగళ్ల బుచ్చంద్ర మాదిగ తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  సిజె గవాయిపై జరిగిన దాడికి నిరసనగా నవంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ నగరంలో లక్షలాది మందితో దళితుల ఆత్మగౌరవ ర్యాలీని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దళిత ప్రజలు అలాగే న్యాయవ్యవస్థ మీద గౌరవాన్ని నిలబెట్టడం రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం కోసం కులాలు, మతాల పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.  దేశ రాజధానిలో అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి ఆర్ గవాయి మీద జరిగిన దాడికి ఇంతవరకు కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నో కేసులలో సుమోటోగా స్వీకరిస్తున్న పోలీసు వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడి కనిపించడం లేదా అన్నారు. అనేక విషయాల మీద స్పందించే మానవ హక్కుల కమిషన్ ఎందుకు మౌనంగా ఉందని, కోర్టులో దాడి జరిగినా కంటెంట్ ఆఫ్ కోర్టు కోర్టు ధిక్కారణ కింద శిక్షలు ఎందుకు అమలు కావడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.  నవంబర్ ఒకటవ తేదీన జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి సెక్రటేరియట్ పక్కన వరకు గల పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనతో పాటు ర్యాలీ జరుగుతుందని రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి ప్రజలు తరలిరావాలని ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More విదేశాల్లో బందీ అవుతున్న భారతీయ మేధస్సు..

About The Author