నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో కొలువుదీరిన నూతన పాలకవర్గం

నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తీగల సునేంద్ర, వైస్ ఛైర్మన్ గా బాదం రమేష్,

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో కొలువుదీరిన నూతన పాలకవర్గం

నాగర్ కర్నూల్ 
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన 24 మంది సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించిన ప్రత్యేక అధికారి, నాగర్ కర్నూల్ ఆర్డీఓ సురేష్ బాబు.     
         ఫిబ్రవరి 11న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్నికైన 24 మంది నూతన సభ్యులను జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో పరోక్ష విధానం ద్వారా చైర్మన్, వైస్ ఛైర్మన్  ఎన్నిక కొరకు సోమవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం  నూతన పాలకవర్గం కొలువుదీరింది.  మున్సిపాలిటీ రెండవ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లు అందరికి ప్రత్యేక అధికారి  ప్రమాణ స్వీకారం చేయించారు.WhatsApp Image 2026-02-16 at 17.50.10
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం 11 గంటలకు  ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు ముందుగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల, అనంతరం బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ​ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం 12.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కూడా ప్రశాంతంగా ముగిసింది. 
24 మంది సభ్యులున్న నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ లో ​చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు, సమావేశానికి 18 మంది కాంగ్రెస్ సభ్యులు, 6 మంది బిఆర్ఎస్ సభ్యులు హాజరయ్యారు. 
100 % కోరం సభ్యుల ప్రతిపాదన మేరకు అధికారులు చైర్‌ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికను  నిర్వహించారు.
 ఈ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పురపాలిక చైర్‌ పర్సన్‌గా 23వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తీగల  సునేంద్ర పేరును 4వ వార్డు కౌన్సిలర్ సభ్యురాలు చింతలపల్లి వసంత ప్రతిపాదించగా 21వ వార్డు కౌన్సిలర్ పొగిడే శంకర్ బలపరిచారు.మరో అభ్యర్థి పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో తీగల సునేంద్ర ను చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి ప్రకటించారు. అనంతరం వైస్ చైర్మన్ గా 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బాదం రమేష్ పేరును 11వ వార్డు కౌన్సిలర్ సభ్యురాలు ఆసిఫా బేగం ప్రతిపాదించగా, 6వ వార్డు  కౌన్సిలర్ మక్కలపల్లి శ్రీనివాసులు  బలపరిచారు. మరో పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో వైస్ చైర్మన్ గా బాదం రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు  ప్రకటించారు. అనంతరం  ప్రత్యేక  అధికారి చైర్మన్, వైస్ చైర్మన్  లను ప్రమాణ స్వీకారం చేయించారు.
నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లను నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మునిసిపల్ కమీషనర్ నాగిరెడ్డి, తహసీల్దార్ తాబితారాణీ, ఎంపీడీవో చేన్నమ్మ, ఎన్నికల అధికారులు, మున్సిపల్ అధికారులు, ఎన్నికైన కౌన్సిలర్లు  తదితరులు పాల్గొన్నారు.

About The Author