మొద్దు నిద్రబోతున్న నార్సింగి మున్సిపల్ అధికారులు
. లంచాల మత్తులో జోగుతున్న దౌర్భాగ్యం
. నార్సింగి మున్సిపల్ కమిషనర్, టిపిఓల అంతులేని అవినీతి
. ఈ వ్యవహారంపై స్పెషల్ కమిషనర్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి దృష్టి సారించాలి
. 111 జీవోలో 10 ఎకరాలలో “కే కన్వెన్షన్ హాల్" అక్రమ నిర్మాణం
. నాలా కన్వర్షన్ లేదు, పైగా ప్రభుత్వ భూమి కబ్జా
. నార్సింగి మున్సిపల్ అనుమతులు లేవు.. ఓ కుంటను కూడా మింగేశారు,
. ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండిఏ, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు అందిన మామూళ్ళు
. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓసారి ఇటువైపు చూడండి
. ఎస్.టి.ఎఫ్ ఇంచార్జ్ కలెక్టర్, మున్సిపల్ శాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి...
చేనును కాపాడటానికి కంచె వేస్తాం.. కానీ ఆ కంచే చేనును మేసేస్తుంటే ఇక ఏమి చేయగలం.. అలాంటి దౌర్భాగ్యపు పరిస్థితే ఇప్పుడు నార్సింగి మున్సిపాలిటీలో చూటుచేసుకుంది..
నార్సింగి మున్సిపాలిటీలో ప్రభుత్వ అధికారులనే అహభావంతో అవినీతి ముసుగువేసుకుని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.. ప్రభుత్వానికి దక్కాల్సిన పన్నును దోచుకుంటున్నారు.. పూర్తిగా ప్రకృతి వైవిద్యానికి విగాథం కలిగిస్తూ.. చెరువులను మింగేశారు.. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు.. ఈ విషయంపై రాతపూర్వక ఫిర్యాదు చేస్తే.. స్పందించకపోవడం వెనుక అంతర్యం ఏమిటో ప్రభుత్వ ఉన్నతాధికారులే సమాధానం చెప్పాలి..
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (భారత శక్తి) :
గండిపేట జలాశయాన్ని అనుకుని 111 జీఓ బయో కన్జర్వేషన్ జోన్ లో.. మోకిలా పోలీస్ స్టేషన్ ఎదురుగా.. శంకర్ పల్లి మండలం రంగారెడ్డి జిల్లా, జన్వాడ గ్రామం సర్వే నంబర్, 725/1, 680/1,680,681 గల భూమి కబ్జాకు గురైంది.. ఇది ప్రభుత్వ భూమి కావడం ఆందోళన కలిగించే విషయం.. ఇక సర్వే నంబర్ 707, 111 జీఓలో గండిపేట్ జలాశయాన్ని అనుకొని కోడి చెరువును మింగేస్తూ, ప్రభుత్వ భూమిని ఆక్రమించి.. ప్రభుత్వం
నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా.. పది ఎకరాలలో కే కన్వెన్షన్ హాల్ పేరుతో ఫంక్షన్ హాల్ నిర్మించారు.. ఫిర్యాదు చేసి పక్షం కాలం గడిచినా అధికారుల్లో ఎలాంటి స్పందన కనిపించడం లేదు.. లంచాలు పుచ్చుకుని నిమ్మకునీరెత్తినట్లు ఉండిపోతున్నారు..

.jpeg)
యాక్షన్ టేకెన్ రిపోర్టు కోసం అడిగితే.. ఫోన్ ఎత్తకుండా ముఖం చాటేయడం పరిపాటిగా మారింది...ఇరిగేషన్ అధికారులు భారీ ఎత్తున అంటే లక్షల్లో ముడుపులు తీసుకొని అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది.. నాలా కన్వర్షన్ ద్వారా అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి కమర్షియల్ ల్యాండ్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు. చేసుకుంటే ప్రభుత్వానికి పన్ను కట్టొచ్చు.. కోట్లల్లో చెల్లించాల్సిన ఆ పన్నును ఎగ్గొట్టాలనే ఆలోచనతో దురహంకారమైన ఆలోచనతో పక్కన ఉన్న కోడి చెరువులోని కొంచెం ప్రభుత్వ భూమిని బరితెగించి మరీ కబ్జాచేసి, దౌర్జన్యంగా.. కే కన్వెన్షన్ హాల్.. రిసార్ట్ నిర్మాణం చేపట్టి.. ఇటు ప్రభుత్వానికి కోట్లల్లో పన్ను ఎగవేస్తూ.. అటు పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ.. అవినీతికి పాల్పడుతున్న అక్రమ నిర్మాణదారుడిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని స్థానిక గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..
కే కన్వెన్షన్ హాల్ పేరుతో అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారని నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కమిషనర్ గారికి వ్రాతపూర్వక ఫిర్యాదుచేస్తే.. పట్టనట్లు వ్యవహరించడంపై అనుమానం వచ్చి స్థానికంగా దర్యాప్తు చేస్తే ఆయనే దగ్గరుండి ఈ అక్రమ నిర్మాణాన్ని ప్రోత్సహించాడని స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు.. ఇక్కడ మున్సిపల్ అధికారులకు లక్షల్లో ముడుపులు అందాయని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ అవినీతిపై మున్సిపల్ అధ్యక్ష స్థాయి అధికారి ఎస్ శ్రీనివాస్ రెడ్డి దృష్టిసారించి, చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..
